Lijomol Jose : సూర్య నటించిన తాజా చిత్రం జై భీమ్. ఈ మూవీ ఇటీవల ఓటీటీలో విడుదలై పెద్ద విజయం సాధించింది. ఇందులోని కొన్ని పాత్రలు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సినతల్లి పాత్ర అందరికీ బాగా కనెక్ట్ అయింది. సినతల్లి పాత్రలో జీవించింది లిజోమోల్ జోస్. జైభీమ్ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలను తెలియజేసింది.
తెలుగులో డబ్ అయిన సిద్ధార్థ్ ఒరేయ్ బామ్మర్ధి సినిమాతో టాలివుడ్ కు ఎంట్రీ ఇచ్చింది లిజోమోల్. జై భీమ్ మూవీలో లిజోమోల్ ఓ గిరిజన మహిళగా.. గర్భవతిగా నటించింది అందరితోనూ కన్నీళ్లు పెట్టించింది. సినతల్లి పాత్రలో నటించిన లిజోమోల్ ఆ పాత్రను పోషించడానికి ఎంతో కష్టపడిందట.
జై భీమ్‌లో పాత్ర కోసం డైటింగ్ చేసి బరువు కూడా తగ్గాను అని చెప్పింది. అలాగే తాను చేసింది గిరిజన స్త్రీ పాత్ర. అంత సులభంగా చేయలేం. కాబట్టి గిరిజన తెగకు చెందిన మహిళలను కలుసుకుని వారితో కొన్ని రోజలు గడిపాను అని పేర్కొంది.
గిరిజనులు పాము కాటుకు ఎలా చికిత్స చేస్తారు. ఆ సమయంలో ఏ ఔషధాలను ఉపయోగిస్తారనే విషయాలను కూడా వారి నుంచి తెలుసుకున్నాను. అంతే కాకుండా.. వారితో కలిసి ఎలుకలు పట్టడానికి కూడా వెళ్లి, వారెలా పడుతున్నారో ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. ఓసారి ఎలుక మాంసం కూడా రుచి చూశాను, చికెన్ తిన్నట్టే అనిపించింది.. అని తెలిపింది లిజోమోల్ జోస్.
అయితే జైభీమ్ చిత్రానికి మొదట్లో పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ రాను రాను ఈ మూవీపై వివాదాలు ఎక్కువయ్యాయి. ఒక సీన్‌లో ప్రకాష్ ఓ వ్యక్తిని స్థానిక భాష మాట్లాడలేదని చెంప చెళ్లుమనిపిస్తాడు. ఈ సీన్‌పై వివాదం రాజుకుంది. దీంతో ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చారు. హిందీని అవమానించడం తమ ఉద్దేశం కాదని, ఆ సీన్ యాదృచ్ఛికంగానే వచ్చిందని చెప్పారు.
తరువాత తమిళనాడుకు చెందిన ఓ సంఘం వారు తమ మనోభావాలను దెబ్బ తీశారంటూ సూర్యపై, జైభీమ్ యూనిట్‌పై పరువు నష్టం కేసు వేశారు. అయితే వివాదాల మాట ఎలా ఉన్నప్పటికీ జై భీమ్ మాత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. సమాజంలో ఇప్పటికీ ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో మూవీకి పబ్లిసిటీ కూడా బాగానే లభించిందని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…