Karthika Deepam : కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతోంది. వంటలక్క తన తల్లి ఇంటికి వెళ్లి తన తండ్రితో కాసేపు సమయాన్ని గడుపుతుంది. ఇక అక్కడి నుంచి వారణాసి ఆటోలో మోనిత వాళ్ళ ఇంటికి బయలు దేరుతుంది. మరోవైపు మోనిత బాబు బారసాల కోసం తెగ హడావుడి చేస్తుంది. కార్తీక్, సౌందర్య, ఆనందరావు ఇష్టం లేకున్నా కూడా మోనిత వాళ్ళ ఇంటికి బయలు దేరుతారు.
దీపలో చాలా మార్పులు వచ్చాయి అనుకుంటూ ఏం చేస్తుందో అని తలుచుకుంటూ సౌందర్య ఏడుస్తూ దీప తీసుకున్న నిర్ణయం చివరిది అనిపిస్తుంది.. అని బాధతో కుమిలిపోతుంది. ఇక మోనిత తన ఇంట్లో సౌందర్య రాక కోసం ఎదురుచూస్తుంటుంది. ఇక భారతి రావడంతో కాసేపు బాధతో మాట్లాడుతుంది. భారతి మాత్రం మోనిత సంతోషాన్ని చూసి ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతుంది. అంతలోనే దీప రావటంతో ఈ రోజే ఏదో క్లైమాక్స్ ఉండబోతుందని అనుకుంటుంది.
దీప రాకను చూసి ప్రియమణి, భారతి ఆశ్చర్యపోతారు. ఇంట్లో ఏర్పాటు చేసిన సందడి గురించి సంతోషంగా మాట్లాడటంతో అలాగే చూస్తూ ఉండిపోతారు. ఇక భారతిని కూడా పలకరిస్తూ మోనితకు డెలివరీ చేసినందుకు థాంక్స్ చెబుతుంది దీప. మొత్తానికి దీప కొత్తగా కనిపించడంతో భారతి ఏం జరుగుతుందో అని ఆలోచనలో ఉంటుంది. ఇక దీప తన వెంట తెచ్చుకున్న బ్యాగ్ ను ప్రియమణికి ఇచ్చి లోపల పెట్టమంటుంది.
తరువాయి భాగంలో సౌందర్య వాళ్లంతా రాగా అందరి ముందు తనది సహజ గర్భం అని చెప్పడానికి ప్రయత్నించడంతో వెంటనే దీప కోపంతో రగిలిపోతూ మోనితపై చెయ్యి ఎత్తుతుంది. ఇక దీప తన బ్యాగ్ లో నుంచి ఏవో గట్టి ప్రూఫ్స్ పట్టుకొచ్చినట్లు పేపర్స్ తీస్తున్నట్లు కనిపించగా కార్తీక్, సౌందర్య, ఆనందరావు ఆశ్చర్యంగా ఉన్నట్లు కనిపిస్తారు. మోనిత మాత్రం షాక్ లో ఉన్నట్లు కనిపిస్తుంది.