Karthika Deepam : బుల్లి తెరపై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సీరియల్ కార్తీక దీపం. ఈ సీరియల్‌లో ఎప్పటికప్పుడు కొత్తదనం చేరుస్తున్నారు. అందువల్ల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆనంద రావు ఇంట్లోకి తిరిగి సంతోషం రావాలి అంటే హిమ పెళ్లి చేయాలని సౌందర్యతో అంటాడు. శౌర్య కనిపించే వరకు హిమ పెళ్లి చేసుకోనని చెప్పిందని, ఇప్పట్లో హిమ దగ్గర ఈ ప్రస్తావన తీసుకు రావద్దని సౌందర్య.. ఆనంద రావుతో అంటుంది.
మరో వైపు జ్వాల(శౌర్య) హిమ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తింగరిది, ఒట్టి అమాయకపు పక్షిలా ఉంది, అప్పట్లో హిమ అన్ని ప్రశ్నలు వేస్తూ ఉండేది, ఇప్పుడు ఈ తింగరిది కూడా అలాగే అడుగుతుంది. డాక్టర్ సాబ్ ను తలుచుకుంటేనే నాలో కొత్త శక్తి వస్తుంది. తింగరిని, డాక్టర్ సాబ్ ను చూస్తే నాకు కావలసిన వాళ్లలా ఉన్నారని అనుకుంటూ ఉంటుంది.
ఇంతలో అక్కడికి ఇంద్రుడు, చంద్రమ్మలు వస్తారు. ఇంటికి ఆలస్యంగా వచ్చినందుకు, ఇంకా దొంగతనాలు చేయడం మానేయనందుకు వాళ్లని జ్వాల తిడుతూ ఉంటుంది. ఇంద్రుడు మేము దొంగతనాలు చేయడం మానేసే టైమ్ వచ్చిందని, ఇక పై దొంగతనాలు చేయమని తన వీపుపై ఉన్న దెబ్బలను చూపిస్తూ జ్వాలతో చెబుతాడు. జ్వాల ఎమోషనల్ గా ఫీలవుతూ రేపటి నుండి వేరే పని చేసుకోండి అని చెబుతుంది.
ఇది ఇలా ఉండగా సౌందర్య, ఆనందరావులు హిమ ఇంటికి రాలేదని టెన్షన్ పడుతూ ఉంటారు. హిమ బస్తీలో ఉండే వాళ్ల పాత ఇంటికి వెళ్లి పాత ఙ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది. డాక్టర్ బాబు ఫోటోను హత్తుకుని ఏడుస్తూ ఫోటో ముందు పూలు వేసి దీపం వెలిగిస్తుంది. డాడీ నన్ను క్షమించండి, నా వల్లే మీరు ప్రాణాలు కోల్పోయారు. నా పాపానికి ప్రాయశ్చిత్తం శౌర్యను కలుసుకోవడమే అని ఏడుస్తూ ఉంటుంది.
మరో వైపు జ్వాల ఆటోలో ఉండగా ఒక పెద్దాయన వచ్చి బస్తీ వరకు వస్తావా అమ్మ అని అడుగుతాడు. దీంతో జ్వాల పాత ఙ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆ పెద్దాయనను బస్తీలో విడిచి పెట్టి, లక్ష్మణ్, వారణాసిల గురించి అడుగుతుంది. ఆ పెద్దాయన ఆ పేరు గల వారు ఇక్కడ లేరని చెబుతాడు. తరువాయి భాగంలో జ్వాల కూడా వాళ్ల పాత ఇంటికి వెళుతుంది. అక్కడ కార్తీక్ ఫోటోకు దండం పెడుతూ, ఆనంద్ నా తమ్ముడు, వాడు నా రక్తమే అంటున్న హిమను చూసి షాక్ కు గురవుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…