Karthika Deepam : కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్‌లో కార్తీక్ ను హాస్పిటల్ డాక్టర్స్ అందరూ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి కార్తీక్, దీప, సౌందర్య, ఆనందరావు హాజరవుతారు. కార్తీక్ గురించి భారతి కాసేపు మాట్లాడి ఆ తర్వాత సౌందర్యను ఆహ్వానిస్తుంది. సౌందర్య వేదికపైకి వెళ్లి కార్తీక్ గురించి గొప్పగా మాట్లాడుతుంది. ఆ వేడుకకు రాదనుకున్న మోనిత అప్పుడే ఎంట్రీ ఇచ్చి షాక్ ఇస్తుంది.
కార్తీక్ గురించి నేను చెప్పగలను అని అనడంతో.. వెంటనే సౌందర్య మాట్లాడుతూ.. కార్తీక్ భార్య దీపకు కార్తీక్ గురించి చాలా తెలుసని, తను మాట్లాడుతుందని అనడంతో.. దీప వెళ్లడానికి సిద్ధమవుతుంది. అప్పుడే మోనిత ఆగకుండా వేదిక పైకి వెళుతుంది. భారతి వచ్చి అడ్డు చెప్పినా కూడా రివర్స్ తనకే కౌంటర్ వేస్తుంది. ఇక మోనిత తనను కార్తీక్ మోసం చేశాడని, గతంలో పెళ్లి చేసుకుంటానని చెప్పి వదిలేసి వెళ్లాడని, ఆ సమయంలో చాలా బాధపడ్డానని అంటుంది.
మోనిత మాటలు విని అక్కడున్న వాళ్ళు తమలో తాము గుసగుసలాడుతుంటారు. అందుకే తాను కార్తీక్ ను వదులుకోలేక ఆర్టిఫిషియల్ గర్భం దాల్చానని చెబుతుంది. ఆ బిడ్డనే కార్తీక్ బిడ్డ అంటూ బిడ్డ వైపు చూపిస్తుంది. మోనిత తాను చెప్పాల్సిన విషయాలు అన్నీ చెప్పాక తనకు న్యాయం చేయమని కోరడంతో దీప లేచి చప్పట్లు కొడుతూ వేదికపైకి వెళ్తుంది.
ఇక తరువాయి భాగంలో మోనిత తన బాబుతో మీ నాన్న ప్రెసిడెంట్ అయ్యాడని అంటుంది. వెంటనే కార్తీక్ కోపంతో రగిలిపోతూ మోనితను చంపేస్తాను అని తన దగ్గరికి వెళ్లడంతో.. సౌందర్య అడ్డుపడుతుంది. అయినా కూడా మోనిత తన మాటలతో వాళ్ళందర్నీ రెచ్చగొడుతుంది. మళ్లీ వాళ్లకు వార్నింగ్ ఇస్తుంది. దీనిని బట్టి చూస్తే ఈ కథ ఇంకా కొనసాగుతున్నట్లు అనిపిస్తుంది. మొత్తానికి ఈ సీరియల్ కు ఇకపై శుభం కార్డు పడదని అర్థమవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…