Karthika Deepam : కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్‌లో వేదికపై మోనిత కార్తీక్ తనను మోసం చేశాడని న్యాయం చేయమని అందరినీ కోరడంతో వెంటనే దీప పైకి వెళ్లి తనదైన స్టైల్లో మోనితకు గట్టి షాక్ ఇస్తుంది. తను మోసం చేసి, తప్పులు చేసి బాగా దిగజారిపోయింది.. అని దీప మోనిత గురించి అనటంతో మోనిత కోపంతో మండిపోయి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇక బయటకు రాగానే ప్రియమణి ఇవన్నీ ఎందుకమ్మా.. అంటూ అనే సరికి తనపై అరుస్తుంది.
అప్పుడే దీప వాళ్లు బయటకు రావడంతో తన బాబుని అడ్డుపెట్టుకొని మీ డాడీ ప్రెసిడెంట్ అయ్యారురా.. అనేసరికి కార్తీక్ కోపంతో రగిలిపోతాడు. అప్పుడే సౌందర్య వచ్చి ఆపుతుంది. ఇక దీప కూడా కోపంతో రగిలిపోతుంది. దీప వాళ్లు ఇంటికి వెళ్లగా ఆదిత్య వాళ్లను పలకరిస్తాడు. మోనిత వచ్చిందని తెలియడంతో కోపంతో రగిలిపోతాడు. అప్పుడే పిల్లలు రావటంతో వాళ్లపై అరుస్తాడు. వెంటనే దీప పిల్లలకు నచ్చజెప్పి అక్కడినుంచి తీసుకెళ్తుంది.
మరోవైపు మోనిత.. దీప మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే లాయర్ సురేష్ ఫోన్ చేసి తనకు గుడ్ న్యూస్ చెబుతాడు. చాలా వరకు పనులు పూర్తవుతున్నాయని అంటాడు లాయర్ సురేష్. దీంతో మోనిత బాగా మురిసిపోతుంది. ప్రియమణితో తన సంతోషాన్ని పంచుకుంటుంది. ఇక సౌందర్య దీప దగ్గర కూర్చొని నువ్వంటే నాకు ఎంతో ఇష్టం అంటూ ఇది అంతా నీ కోసమే చేశాను అంటూ మాట్లాడుతుంది.
ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం ఉందని అంటుంది.
ఒకవేళ కార్తీక్ నిజంగానే తప్పు చేసినట్లయితే వాడితో విడాకులు ఇప్పించే దానిని అనేసరికి దీప షాక్ అవుతుంది. కానీ కార్తీక్ అలాంటి వాడు కాదని అంతా మోనిత వల్లే జరిగిందని బాధపడుతుంది. మొత్తానికి మోనిత లాయర్ సురేష్ తో హైలెట్ ప్లాన్ చేసినట్లు అనిపిస్తోంది.