Karivepaku Karam : మన ఇంటి పెరట్లో తప్పకుండా ఉండాల్సిన చెట్లల్లో కరివేపాకు చెట్టు కూడా ఒకటి. కరివేపాకును మనం తరచూ వంటల తయారీలో ఉపయోగిస్తూ ఉంటాం. కరివేపాకును ఉపయోగించడం వల్ల వంటల రుచి పెరగడమే కాకుండా దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. కానీ కూరల్లో వేసే కరివేపాకును చాలా మంది తీసి పక్కన పెడుతూ ఉంటారు. దీని వల్ల కరివేపాకులో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి అంతగా అందవు. కనుక ఈ కరివేపాకుతో మనం కారాన్ని చేసుకుని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు. కరివేపాకుతో కారాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కరివేపాకు కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
కరివేపాకు – 2 కప్పులు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, శనగ పప్పు – ఒక టేబుల్ స్పూన్, మినప పప్పు – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టేబుల్ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్ కంటే తక్కువ, ఎండు మిరపకాయలు – 10 లేదా తగినన్ని, పసుపు – పావు టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 10, చింతపండు – 15 గ్రాములు, ఉప్పు – తగినంత.
కరివేపాకు కారం తయారీ విధానం..
ముందుగా కరివేపాకును శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత శనగ పప్పు, మినప పప్పు వేసి వేయించాలి. తరువాత ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించాలి. తరువాత ఎండు మిరపకాయలను వేసి అవి రంగు మారే వరకు వేయించాలి. తరువాత పసుపు, ఇంగువ వేసి కలపాలి. ఇప్పుడు ముందుగా ఆరబెట్టుకున్న కరివేపాకును వేసి 3 నుండి 5 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇవి అన్నీ కూడా చల్లగా అయిన తరువాత ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ఉప్పును కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి అవి కచ్చా పచ్చాగా అయ్యేలా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కరివేపాకు కారం తయారవుతుంది. ఈ కారాన్ని గాలి తగలకుండా గాజు సీసాలో నిల్వ చేసుకోవడం వల్ల నెలరోజుల వరకు తాజాగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన కరివేపాకు కారాన్ని అన్నంతోపాటు దోశ, ఇడ్లీ, ఉప్మా వంటి అల్పాహారాలతో కూడా తినవచ్చు. అన్నంలో మొదటి ముద్దను కరివేపాకు కారంతో తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…