Karate Kalyani : నటుడు విశ్వక్‌సేన్ తన అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా కోసం ప్రాంక్ వీడియో చేశారు గుర్తుంది కదా.. అయితే ఆయన వ్యవహారంలో తప్పు దేవి వైపు ఉంది కనుక నెటిజన్లు ఆయనకు మద్దతు పలికారు. అయితే ఆ వివాదం ఇంకా మరిచిపోకముందే ఇంకో కొత్త వివాదం పుట్టుకొచ్చింది. యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డికి, నటి కరాటే కల్యాణికి మధ్య భౌతిక దాడులు చేసే వరకు గొడవ వచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ సంఘటన హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో వీరి దాడి ఘటన వీడియో వైరల్ అవుతోంది. అయితే అసలు ఆ రోజు ఏం జరిగింది ? ఇద్దరిలో ఎవరిది తప్పు ? అని తెలుసుకునేందుకు నెటిజన్లు ఆరాలు తీస్తున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరూ మీడియా సంస్థలకు తమ వెర్షన్‌ను తాము చెప్పుకున్నారు. ఇక వారు చెప్పిన ప్రకారం అసలు ఆ రోజు ఏం జరిగింది ? అన్న విషయానికి వస్తే..
ఆ రోజు తాను ఇంట్లో ఉంటే కరాటే కల్యాణి బయటకు పిలిచిందని.. అలాంటి వీడియోలు పోస్ట్ చేస్తున్నావు ఎందుకని తనను అడిగిందని.. అయితే ఆమె కూడా సినిమాల్లో అలాంటి క్యారెక్టర్లనే చేస్తుంది కదా.. అని అన్నానని తెలిపాడు. అందుకు గాను తనపై భౌతిక దాడి చేసిందని.. అలాగే తనను రూ.1 లక్ష ఇవ్వాలని డిమాండ్ చేసిందని.. లేదంటే కేసు పెడతానని బెదిరించిందని.. మహిళా సంఘాల ద్వారా నీ అంతు చూస్తానని.. లేదంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిందని తెలిపాడు. అయితే తనకు ఎంతో మంది లాయర్లు తెలుసని వారందరూ తన వీడియోలను ఇష్టపడతారని.. చాలా మంది సపోర్ట్ తనకుందని.. తాను ఎంతో చదువుకున్న వాడినని.. కరాటే కల్యాణిలా తాను ప్రవర్తించనని తెలిపాడు.
ఇక కరాటే కల్యాణి మాట్లాడుతూ.. తనకు తెలిసిన బంధువులకు చెందిన ఒక అమ్మాయి ఎస్సార్‌నగర్‌లో ఉంటుందని.. ఆమె శ్రీకాంత్ రెడ్డి గురించి చెప్పిందని.. దీంతో అతని సంగతేంటో తెలుసుకోవాలని బిడ్డను తీసుకుని తాను శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లానని కల్యాణి తెలిపింది. అయితే అతను తన ప్రశ్నలకు చాలా పొగరుగా సమాధానం చెప్పాడని.. అంతేకాకుండా.. తాను అమ్మాయిలకు రూ.15వేలు ఇచ్చి అలాంటి వీడియోలు చేయిస్తానని. నీకు రూ.2 లక్షలు ఇస్తా.. నువ్వు కూడా అలా చేయి.. అని అన్నాడని.. అందుకనే తన తమ్ముడితోపాటు చుట్టూ ఉన్నవారికి కోపం వచ్చిందని.. కనుకనే వారు అతనిపై దాడి చేశారని ఆమె స్పష్టం చేసింది. ఇదీ.. అసలు ఆ రోజు జరిగిందని మనకు ఇద్దరి వెర్షన్‌ల ద్వారా తెలుస్తోంది.
అయితే ఇద్దరూ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోగా.. కేసు విచారణలో ఉంది. ఈ క్రమంలోనే తాను డబ్బులు అడిగినట్లు ఏమైనా రుజువులు ఉన్నాయా.. ఉంటే చూపించండి.. అంటూ కల్యాణి ప్రశ్నించింది. ఇక శ్రీకాంత్ కూడా తాను ఎలాంటి తప్పు చేయలేదని.. తనను ఈ కేసులో ఎలాగైనా ఇరికించాలని చూస్తున్నారని.. కొన్ని టీవీ చానల్స్ వైరల్ కంటెంట్ కోసమే ఆమెను తన ఇంటికి పంపించి అక్కడ గొడవ జరిగేలా చూశాయని.. దీంతో వారికి మంచి వీడియోలు లభించాయని.. టీవీ చానల్స్ రేటింగ్ కోసం ఎంతగైనా తెగిస్తాయని శ్రీకాంత్ ఆరోపించాడు. అయితే ఇందులో నిజా నిజాలు ఏమిటి ? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…