జూనియ‌ర్ ఎన్‌టీఆర్ త‌మ వాడే అంటున్న క‌న్న‌డిగులు.. ఇదెక్క‌డి ట్విస్టు..?

సీనియ‌ర్ ఎన్‌టీఆర్ మ‌న‌వ‌డిగా, హ‌రికృష్ణ కుమారుడిగా జూనియ‌ర్ ఎన్‌టీఆర్ సినిమా రంగంలోకి అడుగు పెట్టిన‌ప్ప‌టికీ త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. త‌న డ్యాన్స్‌, న‌ట‌న‌, మంచి గుణం లాంటి అంశాల‌తోనే ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. నంద‌మూరి వంశం నుంచి అనేక మంది వ‌చ్చి హీరోలుగా త‌మ అదృష్టాల‌ను ప‌రీక్షించుకున్నారు. కానీ ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సొంత టాలెంట్‌, కాస్త ల‌క్ కూడా ఉండాలి. అప్పుడే ఇండ‌స్ట్రీలో రాణిస్తారు. జూనియ‌ర్ ఎన్‌టీఆర్ విష‌యంలోనూ ఇలాగే జ‌రిగింద‌ని చెప్ప‌వ‌చ్చు.

జూనియర్ ఎన్‌టీఆర్ మొద‌ట్లో చాలా లావుగా ఉండేవాడు. కానీ డ్యాన్స్‌, న‌ట‌న మాత్రం అద్భుతం. అయితే మొద‌ట్లో ఇత‌ను హీరోనా అని గేలి చేశారు. కానీ న‌ట‌న, డ్యాన్స్‌తో విమ‌ర్శ‌కుల నోళ్ల‌ను సైతం మూయించాడు. రాను రాను జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌లోని అస‌లైన న‌టుడు బ‌య‌టకు వ‌చ్చాడు. దీంతో ఆయ‌న సినిమాల‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అర‌వింద స‌మేత‌లో ఫ్యాక్ష‌న్ పాత్ర‌లో భీభ‌త్స‌తం సృష్టిస్తే.. ఆర్ఆర్ఆర్‌లో గోండు జాతి బిడ్డ‌గా న‌ట‌న అద‌ర‌గొట్టేశాడు. ఇలా జూనియర్ ఎన్‌టీఆర్ ఎప్ప‌టిక‌ప్పుడు న‌ట‌న‌లో ప‌రిణ‌తి సాధిస్తూ వ‌స్తున్నాడు. అయితే తాజాగా ఓ కార్య‌క్ర‌మంలో భాగంగా జూనియర్ ఎన్‌టీఆర్ క‌న్న‌డ‌లో మాట్లాడి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశాడు.

సాధార‌ణంగా ఇత‌ర భాష‌ల‌ను నేర్చుకుని స్టేజిపై అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌డం అంటే.. అది ఆషామాషీ విష‌యం కాదు. కానీ జూనియర్ ఎన్‌టీఆర్ మాత్రం ఏమాత్రం త‌డ‌బ‌డ‌కుండా క‌న్న‌డ‌లో మాట్లాడాడు. దీంతో ఆయ‌న స్పీచ్‌కు క‌న్న‌డిగులు సైతం ఫిదా అయ్యారు. ఎన్‌టీఆర్ మావాడే అని వారు కితాబిస్తున్నారు. అయితే వారు తెలియ‌క చేసినా కానీ.. వాస్త‌వానికి ఎన్‌టీఆర్ మూలాలు క‌ర్ణాట‌క‌లోనే ఉన్నాయి. అవును.. ఎన్‌టీఆర్ త‌ల్లి షాలిని క‌ర్ణాట‌కకు చెందిన‌వారు. ఆమె మంగ‌ళూరులోని కుంద‌పుర అనే ప్రాంతంలో జ‌న్మించారు.

అయితే షాలిని హైద‌రాబాద్‌కు వ‌ల‌స వ‌చ్చి మ్యూజిక్ టీచ‌ర్‌గా ప‌నిచేస్తున్న స‌మ‌యంలో హ‌రికృష్ణ‌తో ప్రేమ‌లో ప‌డ్డారు. త‌రువాత వివాహం జ‌రిగింది. చాలా కాలం వ‌ర‌కు జూనియర్ ఎన్‌టీఆర్ ను నంద‌మూరి వార‌సుడిగా ఆయ‌న వంశీయులు అంగీక‌రించ‌లేదు. కానీ త‌రువాత అంగీకరించారు. అయితే ఈ విష‌యం ప్ర‌స్తుతానికి అవ‌స‌రం లేదు. కానీ జూనియర్ ఎన్‌టీఆర్ గురించి క‌న్న‌డిగుల‌కు ఇప్పుడు తెలిసిపోయింది. క‌నుక ఎన్‌టీఆర్ మావాడే అని వారు తెగ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్‌తో క‌లిసి ఎన్‌టీఆర్ సినిమా కూడా తీస్తుండ‌డం విశేషం. మ‌రి ఆ మూవీ విడుద‌ల అయితే క‌ర్ణాట‌క‌లో జూనియర్ ఎన్‌టీఆర్ క్రేజ్ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఏది ఏమైనా.. క‌న్నడిగులు ఇలా జూనియర్ ఎన్‌టీఆర్ ను త‌మ వాడిగా చెప్పుకోవ‌డం కొత్త చ‌ర్చ‌కు దారి తీసింద‌ని భావించ‌వ‌చ్చు.

Share
Editor

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM