Kangana Ranaut : బోల్డ్ బ్యూటీ కంగనా రనౌత్ ఈ మధ్య సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తలలోకి ఎక్కుతోంది. తనకు అవసరం లేని విషయాల్లో కూడా స్పందిస్తూ ఏరికోరి సమస్యలను తెచ్చుకుంటోంది. సాగు చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా రైతులు దాదాపు సంవత్సరం నుండి నిరసనలు చేస్తున్నారు. ఇన్ని రోజుల తర్వాత ప్రభుత్వం వారి నిరసనలకు తలొంచింది. సాగు చట్టాలను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం ప్రకటనను ఇచ్చింది.
ఇది విన్న రైతులు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. దీనిపై కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ.. ఢిల్లీ సరిహద్దులో ఏకధాటిగా నిరసనలు చేస్తున్న రైతులను కాళిస్తానీలతో పోలుస్తూ పోస్ట్ పెట్టింది. ఇది నచ్చని సిక్ మతస్థులు ఆమెపై కేసు నమోదు చేయించారు. సుబుర్భన్ ఖన్ పోలీస్ స్టేషన్‌లో కంగనాపై కేసు నమోదయ్యింది. ఇప్పుడు ఆమెను చంపేస్తామంటూ బెదిరింపులకు కూడా దిగుతున్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
దేశానికి ద్రోహం చేసే వారికి వ్యతిరేకంగా మాట్లాడతా. అమాయక జవాన్లను చంపేసే నక్సలైట్లనూ వ్యతిరేకిస్తా. తుక్డే తుక్డే గ్యాంగ్‌లనూ విమర్శిస్తా. విదేశాల్లో కూర్చుని భారత్‌లో ఖలిస్తాన్ ఏర్పాటు కోసం కలలు కనే ఉగ్రవాదులనూ తప్పుబడతా. అయితే, ఇలాంటి బెదిరింపులకు నేను భయపడను. నన్ను చంపేస్తానని ఓ వ్యక్తి పంజాబ్‌లో బహిరంగంగా ప్రకటించాడు. సోనియా గాంధీజీ మీరూ ఒక మహిళే. మీ అత్తగారు ఇందిర గాంధీ ఇదే ఉగ్రవాదులపై తుదిశ్వాస వరకూ పోరాడారు. నన్ను బెదిరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పంజాబ్‌లోని మీ (కాంగ్రెస్) ముఖ్యమంత్రికి సూచించండి.. అని కంగనా విజ్ఞప్తి చేశారు.