Kangana Ranaut : ఇటీవలి కాలంలో అనేక తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం విదితమే. ఈ మధ్యే అలా విడుదలైన పుష్ప మూవీ ఆలిండియా లెవల్‌లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. దీంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అయితే తెలుగు సినిమాలు అలా బాలీవుడ్‌లోనూ మంచి సక్సెస్‌ను సాధిస్తుండడంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్పందించింది.
దక్షిణాదిలో తెలుగు సినిమాలకు ప్రత్యేక ఆదరణ ఉంటుందని కంగనా పేర్కొంది. ఇక్కడి స్టార్లు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తారని, దక్షిణాది చిత్ర సీమ మొత్తం ఇలాగే ఉంటుందని కంగనా పేర్కొంది.
తెలుగు హీరోలు తమ కుటుంబాలకు, అనుబంధాలకు పెద్ద పీట వేస్తారని కంగనా కితాబిచ్చింది. ఇక్కడి స్టార్స్ అందరూ ప్రొఫెషనల్‌గా ఉంటారని పేర్కొంది. కనుక ఇక్కడి స్టార్స్ బాలీవుడ్ వల్ల చెడిపోకూడదని తాను భావిస్తున్నానని.. కంగనా చెప్పింది.