Kangana Ranaut : బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఎప్పుడూ వివాదాలతోనే వార్తలలో నిలుస్తూ ఉంటుంది. ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా చేసే కామెంట్స్ చర్చనీయాంశంగా మారుతూ ఉంటాయి. అయితే ఈవిడ జీవితంలో ఎన్నో బ్రేకప్స్ ఉన్నాయి. గతంలో హృతిక్‌తో ప్రేమాయణం నడిపిందని ఆయన నుండి కొన్ని కారణాల వలన విడిపోయిందని చాలా పుకార్లు వచ్చాయి. పలు సందర్భాలలో హృతిక్‌ని టార్గెట్ చేయడానికి కారణం కూడా అదేనంటూ కామెంట్లు చేశారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాబోయే ఐదేళ్లలో మీరెలా కనిపించబోతన్నారు అని వేసిన ప్రశ్నకు ఆమె తనదైన శైలిలో సమాధానమిస్తూ.. ‘‘నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పిల్లల్ని కనాలనుకుంటున్నాను. రాబోయే ఐదేళ్లలో ఓ తల్లిగా నన్ను నేను చూడాలనుకుంటున్నాను’’ అని కంగనా బదులిచ్చింది. మీ జీవితంలో ఎవరైనా ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారా ? అంటే.. అవునని ఆమె తెలిపారు. అంతే కాదు.. ఆ వ్యక్తి గురించి త్వరలోనే అందరికీ తెలుస్తుందని కంగనా చెప్పడం విశేషం
తాజాగా కంగనా పోస్ట్ చూస్తే తన లవ్ బ్రేకప్ అయినట్టు తెలుస్తోంది. ‘నేను నీ కోసమే జీవించాను. కానీ నువ్వు మాత్రం అన్యాయంగా ప్రవర్తించావు’ అని కంగనా పోస్ట్ చేసింది. దీన్ని చూసిన వాళ్లు కంగనా రనౌత్ రహస్య ప్రేమకు బ్రేకులు పడ్డాయని అనుకుంటున్నారు. మరి కంగనా రనౌత్ పోస్టుకు అర్థం అదేనా ? లేక మరేదైనానా.. అని తెలుసుకోవాలంటే ఆమె స్పందించాల్సిందే. ప్రస్తుతం ధాకడ్, తేజస్, టీకు వెడ్స్ షేర్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించడానికి కంగనా రనౌత్ రెడీగా ఉంది.