Dhaakad Movie : బాలీవుడ్ క్వీన్‌గా పేరుగాంచిన కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమాల కన్నా వివాదాల కారణంగానే ఈ మధ్య కాలంలో ఎక్కువ పాపులర్ అయింది. ఈమె సినిమా రంగం మాత్రమే కాదు.. రాజకీయాల్లోనూ పలు పార్టీలపై విమర్శలు చేస్తుంటుంది. ఫక్తు బీజేపీ పక్షపాతి అయిన కంగనా రనౌత్ వారికి వ్యతిరేకంగా ఎవరు ఏం మాట్లాడినా.. ఏం పోస్టులు పెట్టినా.. వారిపై విరుచుకుపడుతుంటుంది. అయితే కంగనా రనౌత్ ఒక ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నప్పటికీ ఆమె బ్రాండ్ ఇమేజ్ మాత్రం ఆమె సినిమాకు ఎంతమాత్రం ఉపయోగపడలేదు. పైగా ఆమె ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది.
కంగనా రనౌత్ నటించిన ధాకడ్ సినిమా ఈ మధ్యే థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకు తొలి రోజు నుంచే చాలా వరకు థియేటర్లలో ప్రేక్షకులు లేరు. 3వ రోజు సినిమా ప్రదర్శనను పూర్తిగా నిలిపివేసి వేరే సినిమాలను ప్రదర్శించారు. ఈ క్రమంలోనే రూ.95 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా కేవలం రూ.3.77 కోట్లను మాత్రమే వసూలు చేసింది. భారీ డిజాస్టర్‌గా నిలిచింది.
అయితే ఇంతటి ఫ్లాప్ సినిమాను తీసుకునేందుకు ఓటీటీ యాప్‌లు కూడా వెనుకడుగు వేశాయి. కానీ ఎట్టకేలకు జీ5 ధైర్యం చేసింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. అందులో భాగంగానే జీ5లో జూలై 1వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమాను రాక్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించగా.. ఇందులో అర్జున్ రామ్‌పాల్, దివ్యా దత్తాలు ఇతర పాత్రల్లో నటించారు. మరి ఓటీటీలో ఈ మూవీకి ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…