Kalyaan Dhev : మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ, ఆమె భర్త కల్యాణ్ దేవ్‌లు గత కొంత కాలంగా విడిగా ఉంటున్నారనే విషయం మాత్రం స్పష్టమైంది. వీరు గతంలో ఎప్పుడూ కలిసే ఫొటోల్లో కనిపించేవారు. ఒకరి ఫొటోలను ఒకరు షేర్ చేసేవారు. కానీ ఇప్పుడు ఎవరి ఫొటోలను వారే షేర్ చేసుకుంటున్నారు. అలాగే ఆ ఫొటోల్లో వారు సింగిల్‌గానే కనిపిస్తున్నారు. కలసి కనిపిండచం లేదు. దీంతో వీరు విడిపోయారనే వార్తలను నెటిజన్లు బలంగా నమ్ముతున్నారు. అయితే విడాకులు అయ్యాయో.. కాలేదో.. తెలియదు కానీ.. మెగా కాంపౌండ్‌కు కల్యాణ్ దేవ్ దూరమయ్యాడు.. అనే విషయం మాత్రం.. నిజమేనని చాలా మంది నమ్ముతున్నారు.
ఇక కల్యాణ్‌దేవ్ పలు చిత్రాల్లో హీరోగా నటించాడు. అయితే గతంలో మెగా ఫ్యామిలీ ఆయన మూవీలను ప్రమోట్ చేసింది. కానీ ఈ మధ్య ఆయన సినిమాలను పట్టించుకోలేదు. దీంతో ఇటీవల వచ్చిన కల్యాణ్ దేవ్ మూవీలు.. కిన్నెరసాని, సూపర్ మచ్చి.. అసలు రిలీజ్ అయ్యాయనే విషయం కూడా చాలా మందికి తెలియదు. ఈ క్రమంలోనే శ్రీజ, కల్యాణ్‌దేవ్‌ల విడాకుల విషయం ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంది. దీనిపై క్లారిటీ మాత్రం రావడం లేదు.
కాగా కల్యాణ్ దేవ్ తాజాగా తన తల్లికి బర్త్ డే విషెస్ చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. హ్యాపీ బర్త్ డే అమ్మా.. కొన్ని సార్లు జీవితం చాలా కష్టంగా మారుతుంది. కానీ నీ ప్రేమ అందించే శక్తి ద్వారా నాకు ఎదురయ్యే ఎలాంటి అవరోధాన్ని అయినా సరే దాటుకుని ముందుకు వెళ్లగలనని నాకు బాగా నమ్మకం ఉంది. నన్ను ఎల్లప్పుడూ వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్నందుకు థ్యాంక్స్. నువ్వంటే నాకు ఎంతో ఇష్టం.. లవ్ యూ అమ్మా.. అంటూ కల్యాణ్ దేవ్ పోస్ట్ పెట్టాడు. అయితే శ్రీజతో ఉన్న మనస్ఫర్థలు, ఆమె నుంచి విడిపోయిన కారణంగా డిప్రెషన్‌లో ఉన్న కల్యాణ్ దేవ్ ఈ విధంగా పోస్ట్ పెట్టి ఉంటాడని అంటున్నారు. ఈ క్రమంలోనే వీరి విడాకుల వ్యవహారంపై క్లారిటీ రావల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…