Kajal Aggarwal : అందాల చందమామ కాజల్ అగర్వాల్ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుంది. అక్టోబర్ 30, 2020న వీరి వివాహం జరగగా, కరోనా వల్ల కొద్ది మంది మాత్రమే వేడుకలో సందడి చేశారు. రీసెంట్‌గా కాజల్, గౌతమ్ తమ యానివర్సరీని ఘనంగా జరుపుకున్నారు. అయితే ఇటీవల ఆమె గర్భవతి అని వార్తలు తెగ హల్‌చల్ చేశాయి.
పుకార్లకి తగ్గట్టుగానే కాజల్ సినిమాలను కూడా వదులుకుంది. దీనిపై అనుమానాలు రెట్టింపు అయ్యాయి. కాజల్ ప్రెగ్నెన్సీపై ఎన్నో రూమర్స్ రాగా, వాటిపై ఇంతవరకు స్పందించలేదు. తాజగా ఓ ఇంటర్వ్యూలో.. ప్రెగ్నెన్సీపై ఇప్పుడు ఏం మాట్లాడదలచుకోలేదు. టైం వచ్చినప్పుడు స్పందిస్తాను. నా చెల్లి నిషా అగర్వాల్ తల్లి కావడం చూసి నాకు తల్లి కావడంపై విభిన్న రకాల అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఆమె జీవితం ఎలా మారిపోయిందో చూశాను.
ప్రతి ఒక్కరికీ మాతృత్వం అనేది మంచి అనుభూతి. నా సోదరి కొడుకులతో సహవాసం నాకు తల్లి అనే ఫీలింగ్ ఇప్పటికే కలిగించింది. ఒక్కోసారి తల్లి కావాలి అనే భావన నాలో భయాన్ని కలిగిస్తోంది. కానీ నాకంటూ ఓ బిడ్డ ఉంటే జీవితం ఎంతో అందంగా మారిపోతుందని అనుకుంటున్నానని.. తెలిపింది కాజల్.
కాగా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే కాజల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన సౌత్ స్టార్స్ లో ఒకరు. కాజల్ అగర్వాల్.. చిరంజీవి నటించిన సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ డ్రామా ‘ఆచార్య’లో హీరోయిన్ గా కనిపించబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.