Kajal Aggarwal : టాలీవుడ్ ఇండస్ట్రీలోకి లక్ష్మీ కళ్యాణం సినిమాతో తొలిసారిగా అడుగుపెట్టిన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ గురించి అందరికి తెలిసిందే. ఆ తర్వాత నటించిన చందమామ సినిమాతో కుర్రాళ్ళ హృదయాలలో చందమామగా నిలిచింది.
ఇక మగధీర సినిమాతో స్టార్ హీరోయిన్ గా నిలిచింది. ఆ తర్వాత వరుసగా ఎన్నో సినిమాలలో స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకొని వెనుతిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్ళింది.
ఇక గత ఏడాది గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో బాగా బిజీగా మారింది. కేవలం సినిమాల విషయంలోనే కాకుండా తన భర్త విషయంలో కూడా బాగా కేరింగ్ తీసుకుంటోంది. తాజాగా తన భర్త విషయంలో మరో నిర్ణయం తీసుకుంది. త్వరలోనే తన భర్తను కూడా సినిమాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోందని తెలిసింది.
ప్రస్తుతం తాను నటించనున్న సినిమాలలో తన భర్తకు ఏదైనా చిన్న పాత్ర అయినా ఇప్పించాలని మేకర్స్ ను కోరుతోందట. ఇక ఆ పాత్ర కీలకంగా ఉండాలని కండిషన్ లు కూడా పెడుతుందని తెలుస్తోంది. మొత్తానికి కాజల్ తన విషయంలోనే కాకుండా తన భర్త విషయంలో కూడా అస్సలు తగ్గట్లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆచార్య సినిమాతోపాటు పలు సినిమాలతో ఆమె బిజీగా ఉంది.