Kajal Aggarwal : టాలీవుడ్ చందమామగా పేరుగాంచిన కాజల్ అగర్వాల్‌కు ప్రస్తుతం గర్భానంతర సమస్యలు వస్తున్నాయి. బిడ్డకు జన్మనిచ్చినప్పటి నుంచి కాజల్ అగర్వాల్ బాగా బరువు పెరిగింది. అయితే ఆమె బరువు బాగా ఉన్నందునే ఆమెకు పలు చాన్స్‌లు మిస్ అయినట్లు తెలుస్తోంది. ఆచార్య షూటింగ్ సమయంలో కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకున్న విషయం విదితమే. అయితే ఆమె అదే సమయంలో గర్భం ధరించడం వల్లే ఆమె ఇక నటించడం కుదరదని చెప్పి ఆమె సీన్లను సినిమా నుంచి తొలగించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే దర్శకుడు కొరటాల శివ మాత్రం ఇందుకు వేరే కారణం చెప్పారు.
ఆచార్యలో చిరంజీవి నక్సలైట్ పాత్రలో కనిపిస్తారు. కనుక ఆ పాత్రకు హీరోయిన్ ఉంటే బాగుండదని చెప్పి కాజల్ అగర్వాల్ సీన్లను కట్ చేశామని కొరటాల అన్నారు. అయినప్పటికీ అసలు కారణం పైన చెప్పిందే అయి ఉంటుందని తెలుస్తోంది. అయితే అవన్నీ గతం. ఇప్పుడు కాజల్ అగర్వాల్ మళ్లీ కొత్తగా ప్రయాణం మొదలు పెట్టింది. అందులో భాగంగానే అనేక నెలల తరువాత మళ్లీ ఫిట్ నెస్‌పై దృష్టి పెట్టింది. బాగా లావైన కారణంగా ప్రస్తుతం ఆమె బరువును తగ్గించుకునే పనిలో పడింది. అయితే గతంలో ఉన్నట్లు ఇప్పుడు వ్యాయామం చేయడం అంత సులభం ఏమీ కాదని.. చాలా కష్టంగా ఉందని కాజల్ తెలియజేసింది.
ఇప్పుడు బరువు పెరిగాను కనుక వ్యాయామం చేయడం కష్టంగా ఉంది. అయినా సరే శ్రమిస్తున్నా. ప్రస్తుతం గంటల తరబడి వర్కవుట్స్ చేస్తున్నా. హార్స్ రైడింగ్ కూడా మొదలు పెట్టా. కొద్ది రోజుల్లో ఇండియన్ 2 షూటింగ్‌లో పాల్గొంటా.. నాకు అవకాశాలు ఇస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ఇండస్ట్రీకి థ్యాంక్స్.. అని కాజల్ తన ఇన్‌స్టా ఖాతాలో రాసుకొచ్చింది. ఇక కాజల్ అగర్వాల్ చేతిలో ప్రస్తుతం భారతీయుడు 2 తప్ప వేరే సినిమాలు ఏవీ లేవు. మరి ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో మళ్లీ ట్రాక్‌లో పడుతుందా.. లేదా.. అనేది వేచి చూస్తే తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…