Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. పుష్ప సినిమాతో ఆయన క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ మూవీలో ఆయన మాస్ పాత్రలో అలరించారు. పుష్ప మొదటి భాగం ఊహించని స్థాయిలో హిట్ అయింది. దీంతో అల్లు అర్జున్‌కు అటు బాలీవుడ్‌లోనూ డిమాండ్ ఏర్పడింది. ఆయనతో అక్కడి దర్శక నిర్మాతలు సినిమాలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక పుష్ప 2 కూడా త్వరలోనే ప్రారంభం కానుంది.
అయితే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్‌తో యాడ్స్ చేయించుకునేందుకు అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయి. దీంతో త్వరలో ఆయన మరిన్ని యాడ్స్ చేయనున్నారట. ఈ క్రమంలోనే ఆ యాడ్స్ ద్వారా రూ.50 కోట్లు రానున్నాయట. ఒక్కో యాడ్‌కు బన్నీ ప్రస్తుతం రూ.7 కోట్లు తీసుకుంటున్నాడు. ఇక పుష్ప మూవీకి గాను రూ.40 కోట్ల రెమ్యునరేషన్‌ను బన్నీ తీసుకోగా.. ఇప్పుడు రెండో పార్ట్ కోసం ఏకంగా రూ.90 కోట్లు అందుకోనున్నాడు. ఈ క్రమంలో పుష్ప2 మూవీ రెమ్యునరేషన్, యాడ్స్ అన్నీ కలిపి రూ.140 కోట్లను త్వరలోనే అల్లు అర్జున్ తన ఖాతాలో వేసుకోనున్నాడు. ఈ క్రమంలోనే బన్నీ క్రేజ్, పాపులారిటీ చూసి ఆయన ఫ్యాన్స్ ఎంతో సంతోషంగా ఉన్నారు.
ఇక పుష్ప 2 మూవీని రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారని సమాచారం. వాస్తవానికి ఈ మూవీ ఏప్రిల్ నెలలోనే లాంచ్ కావల్సి ఉంది. కానీ సుకుమార్ కథను సిద్ధం చేసేందుకు చాలా సమయం పట్టింది. ఇక ఎట్టకేలకు ఈ మూవీ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే దీన్ని వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…