Jayavani : సాధారణంగా చాలా మంది నటనపై ఉన్న మక్కువతో చిన్న పాత్రలలోనైనా నటించాలని ఇండస్ట్రీలోకి వస్తుంటారు. ఇలా అవకాశాలకోసం ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతూ ఎన్నో రకాల అవమానాలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి అవమానాలను తాను ఎన్నో ఎదుర్కొన్నానని నటి జయ వాణి ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలిపారు. కెరీర్ మొదట్లో తనకు ఎదురైన అవమానాల గురించి చెప్పారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నటనపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చానని అవకాశాలకోసం ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతున్న సమయంలో ఎంతో మంది డైరెక్టర్లు తనని దారుణంగా అవమానించారని ఆమె వెల్లడించారు. కేవలం నల్లగా ఉన్నానన్న కారణంతోనే తనకు అవకాశాలు ఇవ్వలేదని ఆమె తెలిపారు.
ముగ్గురు డైరెక్టర్లు కేవలం తను నల్లగా ఉన్నానని మాత్రమే రిజెక్ట్ చేసినట్లు తెలిపారు. ఇలా అవమానం జరగగానే ముందుగా అవకాశాల కోసం కాకుండా మేకప్ వేసుకోవడం నేర్చుకున్నానని అన్నారు. అనంతరం అవకాశాల కోసం ఇండస్ట్రీలోకి వెళ్లానని తెలిపారు. అప్పుడు ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయని అన్నారు. ప్రస్తుతం హీరోల సినిమాలలో నటించే అవకాశాలు వస్తున్నాయని తెలిపారు.