Jani Master : ఉన్న హీరోలే ఏం పిసుక్కోలేకపోతుంటే.. నువ్వేం పీకుదామని వచ్చావ్.. అంటూ జానీ మాస్టర్ పై నెటిజన్ల కామెంట్స్..!

Jani Master : రాజకీయాలు కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ వారసత్వానికి పెట్టింది పేరు అన్నట్టు ఉంటున్నాయి. ముఖ్యంగా సినిమాల్లో అయితే ఇక్కడ టాలెంట్ కంటే.. మన వాడు అయితే చాలు అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. కుటుంబం పేరు చెప్పుకొని మార్కెటింగ్ చేసుకోవచ్చు అని ఆలోచిస్తారు. దానికి తగ్గట్టే తాతల పేర్లు, తండ్రుల పేర్లు చెప్పుకుని కొందరు.. అమ్మ, పిన్నమ్మ పేర్లు చెప్పుకొని మరికొందరు.. ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఇండస్ట్రీపై పడి బ్రతికేస్తున్నారు. వీళ్లల్లో కొందరికి హీరో అయ్యే లక్షణాలు కూడా లేవు అని అందరికీ తెలిసిందే.

అయితే సినీ ఇండస్ట్రీ చాలా విశాలమైనది. ఉన్న హీరోలు చాలదన్నట్లు.. కొత్త హీరోలకు కూడా అవకాశం ఇస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఉన్న హీరోలే కొత్త కథలు దొరకక తీసిన కథలనే మళ్ళీ తీస్తూ అట్టర్ ఫ్లాప్ సినిమాల‌ను ఖాతాలో వేసుకుంటున్నారు. ఇలాంటి టైంలో ఒక కొరియోగ్రాఫర్ హీరోగా ఎంట్రీ ఇస్తే జనాలు నవ్వుకోరూ..? ప్రస్తుతం అదే జరుగుతోంది.

సినీ ఇండస్ట్రీలో జానీ మాస్టర్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇండియన్ టాప్ కొరియోగ్రాఫర్‌గా దూసుకుపోతోన్నాడు జానీ మాస్టర్. కోలీవుడ్, శాండల్ వుడ్, బాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల‌లోనూ జానీ మాస్టర్ తన సత్తాను చాటుతున్నాడు. ఇక తెలుగులో అయితే జానీ మాస్టర్ స్టెప్పులు కంపోజ్ చేస్తే అవి ట్రెండ్ అవుతాయి. ఈ మధ్యే బీస్ట్ సినిమాలో విజయ్, పూజా హెగ్డేలతో అదిరిపోయే స్టెప్పులు వేయించాడు. అరబిక్ కుత్తు, హళమితి హబీబీ అంటూ అందరినీ ఊపు ఊపేశాడు జానీ మాస్టర్. అయితే శుభ్రంగా వచ్చిన పని చేసుకోక హీరోగా ఎంట్రీ ఇచ్చి జానీ మాస్టర్ తప్పు చేశారు అంటున్నారు కొందరు నెటిజన్లు.

కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ హీరోగా యథా రాజా తథా ప్రజా సినిమా ఆరంభమైంది. శ్రీనివాస్‌ విట్టల దర్శకత్వం వహిస్తున్నారు. హీరో శర్వానంద్‌ క్లాప్‌ కొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శుభ్రంగా వచ్చిన పని చేసుకోకుండా ఇలా హీరోగా ఎంట్రీ ఇవ్వడంపై జానీ మాస్టర్ ను కొందరు ట్రోల్ చేస్తున్నారు . ఉన్న హీరోలే ఏం పిసుక్కోలేకపోతుంటే.. మీరేం పీకుదామని ఇండస్ట్రీకి వచ్చారు సార్.. అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. చూడాలి మరి.. జానీ మాస్టర్ హీరోగా రాణిస్తారో లేదో..!

Share
Usha Rani

నా పేరు ఉషారాణి. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అంటే ఇష్టం. సాహిత్యంపై నాకు కొంత అవగాహన ఉండడంతో రాయాలి అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ లో కంటెంట్ రైటర్ గా చేస్తున్నాను.

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM