Varalaxmi Sarathkumar : స్ట‌న్నింగ్ లుక్ లో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్.. కేవ‌లం 4 నెల‌ల్లోనే భారీగా బ‌రువు త‌గ్గింది..

Varalaxmi Sarathkumar : సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్ కుమార్ కూతురు వ‌ర‌ల‌క్ష్మీ. వార‌సత్వంగా సినిమాల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ త‌నకంటూ న‌టిగా సొంత గుర్తింపు దక్కించుకుంది. సందీప్ కిష‌న్ హీరోగా న‌టించిన తెనాలి రామ‌కృష్ణ బీఏ బీఎల్ సినిమా ద్వారా తెలుగులో ఇండ‌స్ట్రీలోకి త‌న ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికీ , ర‌వితేజ సినిమాలో తాను పోషించిన జ‌య‌మ్మ పాత్ర తోనే బాగా పాపుల‌ర్ అయ్యింది. క్రాక్, నాంది సినిమాల ద్వారా ప‌వ‌ర్ ఫుల్ లేడీ క్యారెక్ట‌ర్ల‌కు తాను సూట్ అవుతాన‌ని నిరూపించుకుంది. అంత‌కు ముందు కూడా కొన్ని డ‌బ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది.

అయితే ఇన్నాళ్లూ త‌ను చేసిన సినిమాల‌న్నింటిలో బొద్దుగా క‌నిపించిన ఈ 37 ఏళ్ల సుంద‌రి హ‌ఠాత్తుగా స‌న్న‌బ‌డిపోయి అందిరినీ షాక్ కి గురి చేస్తోంది. ఈమె లేటెస్ట్ గా త‌న ఇన్ స్టా లో షేర్ చేసిన ఫోటోల ద్వారా ఈ విష‌యం తెలిసింది. కేవ‌లం 4 నెల‌ల కాలంలోనే ఆమె ఈ విధంగా బ‌రువు త‌గ్గింద‌ని స‌మాచారం. ఎవ‌రైనా ఇలా త‌గ్గ‌డం అసాధ్యం అని అంటున్నారు.

Varalaxmi Sarathkumar

ఇక ఈమె ఇన్ స్టాగ్రామ్ పోస్టు లో త‌న ఫోటోల‌ను షేర్ చేస్తూ ఈ విధంగా రాసింది. పోరాటం నిజం, స‌వాలు నిజం, నీకు ఏం కావాలో అది సాధించ‌డానికి ఏదీ నిన్ను ఆప‌లేదు, నువ్వు ఎవ‌రూ, నువ్వు ఏం అవుతావు అని ఎవ‌రూ నీకు చెప్ప‌లేరు, నీకు నువ్వే స‌వాలు వేసుకో, నీకు నువ్వే పోటీగా త‌యార‌వ్వు, అప్పుడు నువ్వు ఏ సాధించావో చూసి నువ్వే ఆశ్చ‌ర్య‌పోతావు.. అని తెలియ‌జేసింది.

ఇంకా త‌ను ఇలా స‌న్నబ‌డ‌డానికి 4 నెలలు శ్ర‌మించాన‌ని, త‌న క‌ష్టానికి ప్ర‌తిఫ‌లం ఇద‌ని, మ‌న‌కు ఏది సంతోషాన్ని ఇస్తుందో అదే చేయాల‌ని, ఇత‌రుల సంతోషం కోసం చేయ‌కూడ‌ద‌ని, మ‌నం ఏం చేయాలో, ఏం చేయ‌కూడ‌దో ఇత‌రులు చెప్ప‌వ‌ద్ద‌ని, మ‌న ఆత్మ‌విశ్వాసమే మ‌న‌కు ఆయుధ‌మ‌ని, మ‌న‌ల్ని మ‌నం న‌మ్మాల‌ని రాసుకొచ్చింది.

ఏదేమైనా కొత్త లుక్ తో ఈమె అంద‌రినీ క‌ట్టిప‌డేస్తుంద‌నే చెప్ప‌వ‌చ్చు. ప్ర‌స్తుతం వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్.. స‌మంత ముఖ్య పాత్ర‌లో రూపొందుతున్న య‌శోద, ఇంకా నంద‌మూరి బాల‌కృష్ణ 107వ సినిమా త‌దిత‌ర చిత్రాల్లో న‌టిస్తోంది.

Share
Prathap

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM