Janhvi Kapoor : శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ గురించి ఎవరికీ పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. సినీ ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఆమె సొంత టాలెంట్ తో పైకి వచ్చింది. పలు చిత్రాల్లో నటించి ఫర్వాలేదనిపించింది. ఈమె సినిమాలు హిట్ కాకున్నా నటిగా తానేంటో నిరూపించుకుంది.
అయితే జాన్వీ కపూర్ ఎప్పటికప్పుడు జిమ్ చేస్తూ ఫిట్ నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ అప్పుడప్పుడు సరదాగా వెకేషన్స్ కి కూడా వెళ్తుంటుంది.
అప్పట్లో మాల్దీవ్స్ కి వెళ్లి స్విమ్ సూట్ లో హొయలు ఒలికించింది. ఇప్పుడు ఫ్రెండ్స్ తో సరదాగా పచ్చని ప్రకృతిలో గడిపేందుకు వెళ్ళింది.
జాన్వీ కపూర్ తన స్నేహితులతో కలిసి అడవిలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోల్లో జాన్వీ చాలా కురచ దుస్తులను ధరించి యువకుల మతులను పోగొడుతోంది.
తెలుపు రంగు టీ షర్ట్, లేత ఆకుపచ్చ రంగు షార్ట్స్ వేసుకున్న జాన్వీ తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇక జాన్వీ నటించిన రూహి అనే హార్రర్ కామెడీ మూవీ ఇటీవలే విడుదల కాగా అది అంతగా కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఈమె ప్రస్తుతం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, గుడ్ లక్ జెర్రీ అనే చిత్రాల్లో నటిస్తోంది.