Janhvi Kapoor : అలనాటి అందాల తార శ్రీదేవి తనయగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ జాన్వీ కపూర్ మాత్రం తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ధడక్ అనే సినిమాతో ఈమె సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ క్రమంలోనే జాన్వీ తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది. అయితే నటనలో మేటి అనిపించుకున్నా.. ఈమె సినిమాలు మాత్రం పెద్దగా హిట్ కావడం లేదు. ఏ సినిమా చేసినా ఫ్లాప్ అవడమో లేదా యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకోవడమో జరుగుతోంది. దీంతో మంచి హిట్ కోసం జాన్వీ ఎదురు చూస్తుందని చెప్పవచ్చు.
ఇక జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండడం లేదు. ఈమె ఎప్పటికప్పుడు అందులో తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తూ పిచ్చెక్కిస్తుంటుంది. అందులో భాగంగానే ఈమె ఇటీవల షేర్ చేసిన ఫొటోలు వైరల్ అయ్యాయి. బ్లాక్ కలర్ డ్రెస్‌లో జాన్వీ కపూర్ చేసిన అందాల ప్రదర్శన చూస్తుంటే కుర్రకారుకు మతులు పోతున్నాయి. అయితే ఈమె పలు హిందీ సినిమాల్లో ఇప్పటి వరకు నటించినా.. ఇంకా తెలుగులో మాత్రం రంగ ప్రవేశం చేయలేదు. తన తల్లి శ్రీదేవి కోరిక కూడా అదే. తన కుమార్తె ఏనాటికైనా తెలుగులో నటించాలన్నది ఆమె కోరిక. అయితే శ్రీదేవి కోరిక త్వరలోనే తీరనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే జాన్వీ కపూర్ టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నట్లు తెలుస్తోంది. ఆమె ఎన్‌టీఆర్‌తో కలిసి నటించనుందని సమాచారం.

జాన్వీ కపూర్ త్వరలోనే టాలీవుడ్‌కు పరిచయం కానున్నట్లు తెలుస్తోంది. ఆమె ఎన్‌టీఆర్ 31వ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైందని వార్తలు వస్తున్నాయి. ఎన్‌టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రానున్న ఈ మూవీలో జాన్వీ హీరోయిన్‌గా ఎంపికైందట. ఈమెను చిత్ర యూనిట్ సంప్రదించగా.. ఈ మూవీలో చేసేందుకు ఈమె ఓకే కూడా చెప్పిందట. కనుక జాన్వీ కపూర్ ఈ మూవీలో హీరోయిన్‌గా దాదాపుగా ఫిక్సయినట్లే అని తెలుస్తోంది. ఇక దీనిపై త్వరలోనే అధికారికంగా వివరాలను వెల్లడించనున్నారని సమాచారం.