Janhvi Kapoor : అందాల తార శ్రీదేవి ముద్దుల తనయగా పేరు తెచ్చుకున్నప్పటికీ జాన్వీ కపూర్ నటనలో మాత్రం మంచి మార్కులనే కొట్టేసింది. ఈ అమ్మడు నటించిన చిత్రాలు అంత పెద్ద హిట్ కాలేదు. కానీ నటిగా మంచి గుర్తింపును మాత్రం తెచ్చి పెట్టాయి. ఈ క్రమంలోనే జాన్వీ మంచి హిట్ కోసం ఎదురు చూస్తోంది. ఇక ఫిట్‌నెస్ విషయంలోనూ జాన్వీ ఎంతో శ్రద్ధ వహిస్తుంటుంది. అందులో భాగంగానే ఆమె తరచూ జిమ్‌లకు వెళ్తూ వర్కవుట్లు చేస్తుంటుంది. ఎల్లప్పుడూ ఈమె జిమ్ వద్ద కనిపిస్తూ సందడి చేస్తుంటుంది. దీంతో ఆమెను ఫొటోలు తీసేందుకు ఫొటోగ్రాఫర్లు సైతం వెంట పడుతుంటారు.
కాగా జాన్వీ కపూర్ తాజాగా మరోమారు వర్కవుట్ సెషన్‌లో పాల్గొంది. ఈసారి ఆమె యోగాతోపాటు పొట్టకు సంబంధించిన వ్యాయామాలు చేసింది. వాటికి సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వాటిల్లో జాన్వీ అందాలను చూసి కుర్రకారు మతులు పోతున్నాయి. పిచ్చెక్కించేలా ఆమె అందాలు ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఫొటోలను తెగ వీక్షిస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే జాన్వీ కపూర్ ప్రస్తుతం పలు వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంది. గుడ్ లక్ జెర్రీ, మిలి, మిస్టర్ అండ్ మిసెస్ మహి, బవాల్ అనే చిత్రాలతో ఈమె చాలా బిజీగా మారింది. ఈ సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి. అయితే ఈమె టాలీవుడ్‌లోనూ అరంగేట్రం చేసేందుకు రెడీ అవుతోంది. కానీ ఆమెకు నచ్చిన కథ ఉన్న సినిమాలు లభించడం లేదని సమాచారం. అందుకనే ఈమె టాలీవుడ్ ఎంట్రీ ఆలస్యం కానుందని తెలుస్తోంది.