Janhvi Kapoor : జాన్వీ కపూర్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారు మతులను పోగొడుతునే ఉంది. ఇటీవలే తన సోదరి ఖుషీ కపూర్ బర్త్ డే పార్టీలో జాన్వీ కపూర్ వేసుకున్న డ్రెస్ చూసి మతులు పోయాయి. ఈ క్రమంలోనే ఆమె తాజాగా మరిన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
సెలబ్రిటీలు అన్నాక తరచూ వెకేషన్స్‌కి వెళ్తుండడం సహజమే. అయితే జాన్వీ కపూర్ మాత్రం వెకేషన్స్‌కు మరికాస్త ఎక్కువగానే వెళ్తుంటుంది. మొన్నీ మధ్యే సారా అలీఖాన్‌తో కలిసి కేదార్ నాథ్ వెళ్లింది. తరువాత ఎడారుల్లో స్నేహితులతో కలిసి పర్యటించింది. ఇప్పుడు బికినీ ట్రీట్‌తో సందడి చేసింది.
తాజాగా జాన్వీ కపూర్ పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అందులో ఆమె బికినీ ధరించి అదిరిపోయేలా ఉంది. దీంతో ఆ ఫొటోలను చూసిన వారు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫొటోల్లో జాన్వీ చేసిన రచ్చ మామూలుగా లేదు.