Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ జాన్వీ కపూర్ కి సినీ ఇండస్ట్రీతోపాటు సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. తన తల్లి శ్రీదేవి అందంతోపాటు టాలెంట్ ని కూడా వారసత్వంగా కంటిన్యూ చేస్తోంది. ఫస్ట్ సినిమాతోనే బీటౌన్ స్టార్ హీరోయిన్ క్రేజ్ ని సంపాదించుకుంది. శ్రీదేవి కూతురుగా ఆమె పేరును నిలబెట్టింది. ఈ క్రమంలో ఆమె బ్యాక్ గ్రౌండ్ ని ఉపయోగించుకోకుండా తన టాలెంట్ తోనే స్పెషల్ ఇమేజ్ ని అందుకుంది. సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటోంది.
ముఖ్యంగా తన తల్లితో ఉన్న మూమెంట్స్ షేర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే లేటెస్ట్ గా జాన్వీ కపూర్ చేతి మీద ఉన్న టాటూ ఫోటో ఇప్పుడు హల్ చల్ అవుతోంది. ఈ టాటూను జాన్వీ మణికట్టుపై వేయించుకుంది. అలాగే ఐ లవ్ యూ మై లబ్బూ అంటూ రాయించుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలో ఉన్న లబ్బు పేరు ఎవరిదబ్బా అంటూ తెగ ఎంక్వయిరీలు చేస్తున్నారు. లబ్బు అనే వ్యక్తిని ఎంతగా ప్రేమిస్తే తన మణికట్టుపై టాటూగా వేయించుకుంటుంది.. అంటూ నెట్టింట్లో గుసగుసలాడుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది.
https://www.instagram.com/p/CUt19fjot2Q/?utm_source=ig_embed&ig_rid=a3384b60-9b1f-4896-a272-c78db374e81b
లబ్బూ అంటే తాను లవ్ చేసే వ్యక్తి పేరు కాదట. జాన్వీ కపూర్ తన తల్లి శ్రీదేవిని లబ్బూ అని పిలిచేదట. అలాగే తన తల్లి హ్యండ్ రైటింగ్ తో ఉన్న ఆ సెంటెన్స్ ని అచ్చుగుద్దినట్లుగా అలాగే తన చేతి మీద టాటూగా వేయించుకుంది. శ్రీదేవి మూడో వర్ధంతికి తనకు తల్లి రాసిన నోట్ ని జాన్వీ కపూర్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. అందులో లవ్ యూ మై లబ్బూ.. యూ ఆర్ ది బెస్ట్ బేబీ ఇన్ ది వరల్డ్.. అని ఎంతో ప్రేమతో రాసి ఉంది. ఇక జాన్వీ కపూర్ సినిమాల్లోకి రావడానికి కూడా శ్రీదేవి స్పూర్తిగా నిలిచిన విషయం తెలిసిందే. అందుకే జాన్వీ తన తల్లిపై ఉన్న ప్రేమను ఇలా చూపించింది.. అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.