Janhvi Kapoor : ధడక్ అనే సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అయిన బ్యూటీ జాన్వీ కపూర్. అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తెగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ నటనలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ఈమె సొంతం చేసుకుంది. అయితే ధడక్ మూవీ అంతగా ఆదరణను దక్కించుకోలేకపోయింది. ఆ తరువాత ఈమె పలు చిత్రాల్లో నటించింది. గుంజన్ సక్సేనా, రూహి చిత్రాల్లో నటించింది. కానీ ఇవి కూడా హిట్ కాలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం జాన్వీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అందులో ఈమె ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఈమె ఓ అవార్డు కార్యక్రమంలో మెరిసింది. ఈ క్రమంలోనే ఈమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా ముంబైలోని జేడబ్ల్యూ మారియట్‌లో నిర్వహించిన స్టైల్ ఐకాన్ అవార్డ్స్ షో కార్యక్రమంలో జాన్వీ కపూర్ పాల్గొంది. ఈ షోకు ఆమె బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి వచ్చింది. ఎద మధ్య భాగం చూపిస్తూ నెక్లెస్ ధరించి జాన్వీ చేసిన షో చూస్తుంటే కుర్రకారు మతులు పోతున్నాయి. ఈ కార్యక్రమానికి ఎంతో మంది ఇతర హీరోయిన్లు హాజరైనప్పటికీ జాన్వీ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ క్రమంలోనే ఈమె బ్లాక్ కలర్ డ్రెస్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ కార్యక్రమంలో ఆమె ఓ అవార్డును కూడా అందుకుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా జాన్వీ కపూర్ సూపర్ స్టైలిష్ యాక్టర్ (ఫీమేల్) అవార్డును అందుకుంది. ఇక ఈ కార్యక్రమానికి అనిల్ కపూర్, రణ్‌వీర్ సింగ్, కార్తీక్ ఆర్యన్, సారా అలీ ఖాన్, కృతి సనన్, కరణ్ జోహార్, కియారా అద్వానీ, అర్జున్ కపూర్, వరుణ్ ధవన్, సిద్ధార్థ్ మల్హోత్రా తదితరులు హాజరయ్యారు. అయితే జాన్వీతోపాటు పలువురు ఇతర సెలబ్స్ కూడా అవార్డులను అందుకున్నారు.
కార్తీక్ ఆర్యన్ మేల్ కేటగిరిలో సూపర్ స్టైలిష్ అవార్డును అందుకోగా.. అనిల్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్, అర్జున్ కపూర్ తదితరులు ఇతర విభాగాల్లో అవార్డులను అందుకున్నారు. ఇక జాన్వీకపూర్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె గుడ్ లక్ జెర్రీ, మిలి, మిస్టర్ అండ్ మిసెస్ మహి, బవాల్ అనే సినిమాల్లో నటిస్తోంది. ఇవి త్వరలోనే రిలీజ్ కానున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…