Jagadeka Veerudu Athiloka Sundari : 1990లో ఇంద్రలోకానికి అధిపతి అయిన ఇంద్రుడు కూతురు ఇంద్రజ భూమికి దిగి వచ్చి ఒక మానవుని ప్రేమిస్తే ఎలా ఉంటుందో.. అని ఒక కొత్త కథాంశంతో వచ్చిన చిత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన అతిలోక సుందరిగా శ్రీదేవి నటించింది. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. సి.అశ్వినీదత్ నిర్మాణ సారథ్యం వహించారు. ఇళయరాజా అందించిన సంగీతం ఇప్పటి తరానికి కూడా ఎంతో నచ్చుతుంది. అంత అద్భుతంగా ఉంటాయి ఈ చిత్రంలోని పాటలు.
అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. నిర్మాణ సంస్థకు కాసుల వర్షం కురిపించింది. మెగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ తమ బ్లాక్ బస్టర్ చిత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రానికి సీక్వెల్ గా చిత్రం నిర్మించాలనే కోరికను వ్యక్తం చేశారు. ఇటీవల సీతారామం సక్సెస్ మీట్ లో పాల్గొన్న అశ్వినీ దత్ రామ్ చరణ్ తో తప్ప మరెవరితోనైనా జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం రూపొందించాలనే తన కోరికను వ్యక్తం చేశారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవిని కూడా ఒక పాత్రలో చేర్చాలనుకుంటున్నాను అని వెల్లడించారు.
అశ్వినీ దత్ ఇదే విషయాన్ని చిరంజీవితో మాట్లాడారని, దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాలని అనుకున్నారట. ఈ విషయంపై చర్చలు జరపగా కథ మెగాస్టార్ కి నచ్చలేదట. చరణ్ హీరోగా జగదేకవీరుడు అతిలోకసుందరి సీక్వెల్ కోసం తాజా కథ తీసుకురావడానికి మెగాస్టార్ బాధ్యతలు అప్పగించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల బట్టి రాఘవేంద్రరావు కచ్చితంగా ఈ చిత్రాన్ని చెయ్యలేరు. కాబట్టి ఇప్పటి తరాన్ని ఆకట్టుకునే విధంగా విజువల్ ఎఫెక్ట్స్ ఉత్తమమైన కథను బయటకు తీసుకురావడంతోపాటు, సమర్థవంతమైన ఫిలిం మేకర్స్ కూడా అవసరం. అశ్వినీదత్ కి సరైన దర్శకుడు దొరికితే మెగాస్టార్ చిరంజీవి రెడీ అయ్యి ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. ఇక దీనిపై త్వరలో ఏమైనా వివరాలను వెల్లడిస్తారేమో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…