Charmy Kaur : నీతోడు కావాలి చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది ఛార్మి కౌర్. 13 సంవత్సరాల వయసులోనే తెలుగు తెర ఇండస్ట్రీలో అడుగు పెట్టి లక్ష్మీ, గౌరి, మంత్ర, మంగళ, రాఖీ, జ్యోతిలక్ష్మి వంటి ఎన్నో చిత్రాలలో నటించి తన అందం, అభినయంతో ఎందరో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటన పరంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఛార్మి ప్రస్తుతం తెరపై కనిపించడం లేదు. చిత్రాల్లో నటించకపోయినా చిత్రసీమ మీద అభిమానంతో నిర్మాతగా మారింది.
పూరీ జగన్నాథ్ తో కలిసి సినిమాలు నిర్మిస్తూ బిజీగా మారిపోయింది. చిత్రాలలో నటించకపోయినా నిర్మాతగా వ్యవహరిస్తూ ఇప్పటికీ ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులను సందడి చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. 2002లో ఛార్మి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఛార్మి తెలుగు తెరకు పరిచయమై దాదాపు రెండు దశాబ్దాలు కాబోతోంది. కానీ ఇప్పటికీ అదే చెక్కుచెదరని అందంతో యువతలో ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గడంలేదు.
చిత్రసీమలో అడుగు పెట్టి దాదాపు రెండు దశాబ్దాలు గడుస్తున్నా ఛార్మి ఇప్పటికీ ఎన్ని ఆస్తులు సమకూర్చుకుందో తెలిస్తే మీరు కూడా షాక్ అవ్వాల్సిందే. 2019 లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం ఛార్మి రెండు మిలియన్ డాలర్ల అంటే దాదాపు 15 కోట్ల రూపాయలకు పైగా ఆస్తిని కూడబెట్టినట్లు వెల్లడయ్యింది. ఈ నాలుగు సంవత్సరాలలో ఆమె ఆస్తులు విలువ మరింత పెరిగినా ఆశ్చర్యపడనవసరం లేదు. అంతేకాకుండా ఛార్మికి హైదరాబాద్‌లో ఎంతో ఖరీదైన అపార్ట్‌మెంట్ తో పాటు ఎన్నో విలువైన ఆస్తులు కూడా ఉన్నాయి.
ఛార్మికి ఉన్న కార్స్ లిస్ట్ కూడా పెద్దదే. రూ.2 కోట్ల విలువ చేసే ఖరీదైన బీఎండబ్ల్యూ 730 ఎల్‌డీ తోపాటు మరికొన్ని కార్లు కూడా ఆమె దగ్గర ఉన్నాయి. అదేవిధంగా ముంబైలో కూడా కోట్ల విలువ చేసే మూడు అపార్ట్‌మెంట్లు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఒక హీరోయిన్ ఈ రేంజ్ లో ఆస్తులు కూడబెట్టడం అనేది అంత ఆషామాషీ విషయమేమీ కాదు. ప్రస్తుతం ఈ నెల 25న విడుదల కాబోతున్న లైగర్ చిత్రం నిర్మాణంలో కూడా భాగస్వామ్యం వహిస్తోంది ఛార్మి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…