Jacqueline Fernandez : శ్రీలంక బ్యూటీ, బాలీవుడ్ అందాల తార జాక్వెలిన్ ఫెర్నాండేజ్ రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సుమారుగా 14 మందిని మోసం చేసి రూ.200 కోట్లు కొల్లగొట్టాడని సుకేష్ చంద్రశేఖర్‌పై అభియోగం ఉండగా, ఇప్పుడు అతనితో చాలా సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో ఆమె మళ్లీ చిక్కుల్లో పడ్డట్టే.. అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఘరానా మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ తో జాక్వెలిన్ కు సంబంధాలు ఉన్నట్లు కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో విచారణకు గాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పలు మార్లు జాక్వెలిన్ కు నోటీసులు పంపింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే విచారణకు హాజరైంది.
మిగిలిన సందర్భాల్లో షూటింగ్ లో బిజీగా ఉన్నట్లు సాకుగా చెబుతూ డుమ్మా కొట్టింది. అయితే ఈడీ మాత్రం సుఖేష్‌కి ఏయే సెలెబ్రిటీలతో సంబంధాలు ఉన్నాయి, వారితో సుఖేష్ ఎలాంటి డీల్స్ కుదుర్చుకున్నాడు అనే కోణంలో ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ముందుగా సుఖేష్ తో జాక్వెలిన్, నోరా ఫతేహి లాంటి సెలెబ్రిటీలు రిలేషన్ కొనసాగించినట్లు తెలుస్తోంది. సుఖేష్ మధ్యంతర బెయిల్ పై విడుదలైన సమయంలో ఏప్రిల్ – జూన్ కాలంలో ఈ సెల్ఫీ తీసుకున్నట్లు తెలుస్తోంది.
సుఖేష్.. జాక్వెలిన్‌ను చెన్నైలో దాదాపు నాలుగుసార్లు కలిశాడని, అంతేకాకుండా జాక్వెలిన్‌కు ప్రైవేటు జెట్ ను కూడా ఏర్పాటు చేసినట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ ఫొటోలతో జాక్వెలిన్‌కి కష్టాలు తప్పేలా లేవు. ఈ అమ్మడు పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తుందని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…