Jabardasth : బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి సింగర్ మనో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రతివారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు ముందుగానే విడుదల చేస్తారు. ఈ క్రమంలోనే ఈ వారానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేయడంతో ఆ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో భాగంగా రాకింగ్ రాకేష్ చేసిన స్కిట్ లో భాగంగా సింగర్ మనో అతనితో గొడవ పడి అక్కడి నుంచి లేచి వెళ్ళి పోవడం చూపించారు.
ఈ క్రమంలోనే రాకేష్ మనోను బ్రతిమలాడగా సింగర్ మనో తన పైకి చేయి చేసుకున్నట్లు ప్రోమోలో చూపించారు. ఈ ప్రోమో చూసిన చాలా మంది కేవలం రేటింగ్స్ కోసమే ఇలా చేసి ఉంటారని ముందుగా భావించారు. అయితే ఈ కార్యక్రమం ప్రసారం కాగా ఇందులో అలాంటి సంఘటనలకు సంబంధించిన ఏ సన్నివేశం లేకపోవడంతో నెటిజన్లు జబర్దస్త్ టీమ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేవలం రేటింగ్స్ కోసం ఇంతగా దిగజారుతారా ? సిగ్గులేదా మీకు అసలు.. అంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ప్రోమోలో ఒక విధమైనటువంటి కంటెంట్ చూపించి స్కిట్ లో అందుకు సంబంధించిన కంటెంట్ లేకపోవడంతో ప్రోమోలో చూపెట్టిన కంటెంట్ ఎక్కడ.. అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి కార్యక్రమ రేటింగ్స్ కోసం జబర్దస్త్ టీమ్ పడ్డపాట్లు ఇలా చీవాట్లు పెట్టిస్తున్నాయి.