Jabardasth Raghava : ఓ ప్రముఖ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోకి ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో అందరికీతెలిసిందే. ఈ కామెడీ షో ఎంతో మంది ఆర్టిస్ట్ లకు జీవితాన్ని ఇచ్చింది. ఇందులో గుర్తింపు పొందిన అనేక మంది ఆర్టిస్టులు సినిమాల్లో కూడా నటిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఇలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన వారిలో రాకెట్ రాఘవ ఒకరు. రాఘవ కామెడీ స్కిట్ ల ద్వారా ప్రతివారం ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఆయన కుమారుడు మురారిని కూడా జబర్దస్త్ లోకి తీసుకువచ్చాడు.
మురారి కేవలం జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో ఎంతోమంది చిన్న పిల్లలు సందడి చేసినప్పటికీ మురారి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఇంత చిన్న వయసులోనే ఈ బుడ్డోడు తీసుకునే రెమ్యూనరేషన్ వింటే షాక్ అవ్వాల్సిందే.

మురారి ఏదైనా స్కిట్ లో పర్ఫామెన్స్ చేస్తే తనకు టీం లీడర్స్ లేదా మల్లెమాలవారు రెమ్యూనరేషన్ అందిస్తారు. ఇలా ఒక్కో కాల్ షీట్ కోసం మురారి ఏకంగా రూ.5000 వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడట. అలా కాకుండా కొంచెం నిడివి ఎక్కువగా ఉన్న స్కిట్ చేస్తే రూ.10000 వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ బుడ్డోడు ఇంత చిన్న వయసులోనే అంత డబ్బు సంపాదిస్తున్నాడు అంటే గ్రేట్ కదా. ఇది తెలిసిన నెటిజన్లు భవిత్యత్తులో మురారికి మంచి ఫ్యూచర్ ఉంది అని అభినందిస్తున్నారు.