Jabardasth Avinash : జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ ముక్కు అవినాష్ ఆ తర్వాత బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు పెళ్లి పెళ్లి అంటూ ఎంతో కలవరించిన అవినాష్ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. అనూజ అనే అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేసి ఎంతో అంగరంగ వైభవంగా వివాహాన్ని జరుపుకున్నాడు. ఇక అవినాష్ పెళ్లికి బిగ్ బాస్ కంటెస్టెంట్ లు దివి, సోహైల్, అరియానా హాజరై సందడి చేశారు.
ఈ క్రమంలోనే వీరందరూ అవినాష్ జంటతో ఫోటో దిగగా ఆ ఫోటోను దివి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేస్తూ ఆ ఫోటోలో ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ఉండటంతో వారందరి గురించి కామెంట్లు చేస్తూ వారి పరువు తీసింది. ముందుగా ఈ ఫోటోని షేర్ చేస్తూ అవినాష్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసింది. అదేవిధంగా సోహైల్ గురించి కామెంట్ చేస్తూ ముందు ఫోటో సరిగా వచ్చిందా లేదా అని చూసుకొని ఆ తర్వాత విషెస్ చెప్పాలని చూస్తున్నట్టు ఉంది అంటూ రాసుకొచ్చింది.
ఇక అరియనా తన డ్రెస్ సరిగా ఉందా లేదా అని చూసుకుంటుందని, తాను మాత్రం భోజనాలు ఎక్కడ పెడుతున్నారా.. అంటూ భోజనాల కోసం చూస్తున్నట్లు ఉందని వారి గురించి తనే కామెంట్ చేసింది. ఇక అవినాష్ అయితే తన పెళ్లికి గిఫ్ట్ తీసుకువచ్చారా లేదా అన్నట్టు చూస్తున్నాడని.. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఈ ఫోటోపై కామెంట్ చేసింది. ఇలా అవినాష్ పెళ్ళిలో జబర్దస్త్ కమెడియన్స్, బిగ్ బాస్ కంటెస్టెంట్ లు కలిసి ఎంతో సందడి చేశారు. ప్రస్తుతం అవినాష్ పెళ్లికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…