Aryan Khan : బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ముంబై క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ కేసులో అక్టోబర్ 2వ తేదీన అరెస్టు కాగా, అప్పటినుండి డ్రగ్స్ కేసుపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అక్టోబర్ 8 నుండి జైలులో ఉన్న కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను బయటకు తీసుకు రావడానికి షారూఖ్ నానా ప్రయత్నాలు చేస్తున్నారు.
అరెస్ట్ అయినప్పటి నుంచి ఆర్యన్‌కి సంబంధించి పలుమార్లు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా.. ఈ కేసు విచారిస్తోన్న ప్రత్యేక న్యాయస్థానం మాత్రం ఆర్యన్ అభ్యర్థనను తోసిపుచ్చుతూ వస్తోంది. ఈ క్రమంలో బుధవారం మరోసారి ఆర్యన్‌కు బెయిల్ నిరాకరిస్తూ తీర్పు నిచ్చిన సంగతి తెలిసిందే. నాలుగోసారి కూడా ఆర్యన్‌కు బెయిల్ రాకపోవడంతో తనయుడిని చూసేందుకు షారుక్ ఆర్థర్ రోడ్డు జైలుకు వచ్చాడు. తండ్రిని చూసి ఆర్యన్ శోకసంద్రంలో మునిగినట్టు తెలుస్తోంది.
జైలు ఖైదీలతో కలిసి ఒకే బ్యారక్ లో ఆర్యన్ ఖాన్ ఉంటున్నట్టు సోమవారం విడుదలైన శ్రవణ్ నాడార్ అనే వ్యక్తి చెప్పారు. 100 మంది ఖైదీలు ఉన్న బ్యారక్ లో ఆర్యన్ ఖాన్ వాళ్లతో కలిసి ఉంటున్నట్టు వెల్లడించారు. కేవలం పది ఫ్యాన్లు, నాలుగు టాయిలెట్స్ మాత్రమే ఉండే ఆ గదిలో ఉంటున్నారని చెప్పాడు. జైలు ఆహారాన్ని తీసుకోవడం లేదని, కేవలం బిస్కెట్లు, చిప్స్ మాత్రమే తింటున్నాడని, జైలు అధికారులు ఇచ్చిన ఆహారాన్ని ఇతర ఖైదీలకు ఇస్తున్నాడని వెల్లడించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…