Naresh : సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల గురించి అనేక వార్తలు వస్తున్నాయి. అయితే ఆశ్చర్యకరంగా వార్తల్లో చాలా వరకు నిజమే అవుతుండడం విశేషం. గతంలో సమంత, చైతన్య విడిపోతారని అనేక వార్తలు వచ్చాయి. అలాగే జరిగింది. ఇక పలువురు సెలబ్రిటీల గురించి ఈమధ్య కాలంలో అనేక వార్తలు వస్తున్నాయి. బయటికి పుకారే అయినప్పటికీ ఆ వార్తల్లో నిజం ఎంతో కొంత ఉందని అంటున్నారు. ఇక అలాంటి వార్తే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే..
నటుడు నరేష్ మూడో పెళ్లికి సిద్ధమయ్యారని, ఆయన పవిత్ర లోకేష్‌ని మూడో వివాహం చేసుకుంటున్నారని ఈ మధ్య కాలంలో వార్తలు బాగా వస్తున్నాయి. అయితే ఆశ్చర్యకరంగా ఆయన గానీ, పవిత్ర లోకేష్ కానీ ఈ వార్తలను ఖండించలేదు. దీంతో ఇది నిజమేనని.. కనుకనే వారు స్పందించడం లేదని తెలుస్తోంది. వీరి గురించి గత వారం రోజులుగా అనేక వార్తలు వచ్చాయి. అయితే వారు వాటిని ఖండించలేదు. దీంతో వారు వివాహం చేసుకోనున్నారనే అనుకుంటున్నారు.

నరేష్ మొదటి భార్య రేఖ కాగా.. ఆమెతో పలు కారణాల వల్ల విడిపోయారు. తరువాత రమ్య అనే అమ్మాయిని చేసుకున్నారు. అయితే ఈమె చేసిన చీటింగ్ ఇటీవల బయట పడింది. దీంతో ఆమెకు, తనకు ఎలాంటి సంబంధం లేదని నరేష్ చెప్పుకొచ్చారు. తాము విడిపోయి 5 ఏళ్లు అవుతుందని అన్నారు. అయితే ఇప్పుడు ఆయన మూడో పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. కానీ వీటిపై నరేష్ మాత్రం స్పందించలేదు. దీంతో ఆయన పెళ్లి వార్త నిజమేనని అనుకుంటున్నారు. అయితే దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.