IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఐపీఎల్.. సీజన్ మొదలు కాబోతుందంటే చాలు.. క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. ఐపీఎల్ మ్యాచ్‌లకు గతంలో భారీగా టీఆర్పీ రేటింగ్స్ కూడా వచ్చేవి. ఐపీఎల్ సీజన్‌లో పెద్ద సినిమాలను రిలీజ్ చేయాలంటే నిర్మాతలు వెనుకడుగు వేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారు అయిందనే చెప్పవచ్చు. ఐపీఎల్‌ను అసలు ప్రేక్షకులు ఆదరించడం లేదనే విషయం స్పష్టమవుతోంది. అందుకు కారణం తాజాగా విడుదలైన రేటింగ్స్ అని చెప్పవచ్చు.
కోవిడ్ ముందు సీజన్‌లో ఓపెనింగ్ వారంలో ఐపీఎల్‌కు ఏకంగా 3.85 రేటింగ్స్ వచ్చేవి. తరువాత గత సీజన్‌లో 3.75 రేటింగ్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం ఓపెనింగ్ వారంలో కేవలం 2.52 రేటింగ్స్ మాత్రమే వచ్చాయి. అలాగే గత సీజన్‌లో ఐపీఎల్ రీచ్ 267.7 మిలియన్లు ఉండేది. ఇప్పుడు అది 229.06 మిలియన్లకు పడిపోయింది. అంటే.. ఈసారి ఐపీఎల్‌ను ప్రేక్షకులు అంతగా ఆదరించడం లేదని.. ఈ రేటింగ్స్ ద్వారా తేలిపోయింది. వీటిని టీవీ రేటింగ్స్ ను ఇచ్చే బార్క్ ఇండియా వెల్లడించింది.
అయితే గత సీజన్లకు ఇప్పటికి చాలా తేడా ఉంది. రెండు కొత్త టీమ్‌లు కలవడం, మ్యాచ్‌ల సంఖ్య పెరగడం ప్రేక్షకులకు కాస్త బోర్ కొట్టించేలా ఉంది. అలాగే ఈ సారి టీమ్‌లలో ప్రేక్షకులకు తెలిసిన ప్లేయర్లు, పాత ముఖాలు లేవు. కొత్త ముఖాలు చాలా వచ్చాయి. అలాగే వీక్షకులు ఇష్టపడేలా మ్యాచ్‌ల షెడ్యూల్ లేదు. ఇవన్నీ ఈసారి ఐపీఎల్ రేటింగ్స్ తగ్గడానికి గల కారణాలుగా చెబుతున్నారు. దీంతో 2023-27 కాలానికి గాను ఐపీఎల్ మీడియా రైట్స్‌కు వేలం వేయనున్న బీసీసీఐ ఆందోళన చెందుతోంది. తాము అనుకున్న మొత్తం వస్తుందో.. రాదోనని ఖంగారు పడుతున్నారు.
గతంలో ఐపీఎల్ మ్యాచ్‌లప్పుడు పెద్ద సినిమాలను విడుదల చేసేవారు కాదు. చేసినా వాటి వసూళ్లపై ఐపీఎల్ ప్రభావం పడేది. అయితే ఈ మధ్య కాలంలో పలు భారీ బడ్జెట్ చిత్రాలు వచ్చాయి. కానీ ఐపీఎల్ ప్రభావం వాటిపై పడలేదు. అంటే.. ఐపీఎల్‌కు ఆదరణ ఈసారి అంతగా లేదని.. ప్రేక్షకులు లైట్ తీసుకుంటున్నారని స్పష్టమవుతోంది. రేటింగ్స్ కూడా అలాగే వచ్చాయి. మరి రానున్న రోజుల్లో అయినా ఈ సారి సీజన్ ఆసక్తికరంగా మారుతుందా.. రేటింగ్స్ పెరుగుతాయా.. లేదా.. అన్నది చూడాలి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…