Ghani Movie : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన చిత్రం గని. స్పోర్ట్స్ డ్రామాలో రూపొందిన ఈ చిత్రం మంచి అంచనాల నడుమ ఏప్రిల్ 8న విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా పూర్తి రన్‌లో రూ.4 కోట్లు కూడా కష్టం అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ సినిమాకు రూ.25.3 కోట్లలో రేంజ్ బిజినెస్ జరగగా.. రూ.26.30 కోట్ల రేంజ్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. కాగా ఈ సినిమా మొదటి రోజు నుంచే ట్రాక్ తప్పింది. ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతోంది. బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు రోజుల్లో అసలు బిజినెస్ ను ఏ దశలోనూ అందుకునే దిశగా అడుగులు వేయలేక పోయిందనే చెప్పాలి.
వీక్ డేస్ లో కూడా సినిమా ఇక తేరుకోలేకపోయిందనే చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు ఆదివారం అలాగే శ్రీరామనవమి కూడా అయినప్పటికీ కూడా టార్గెట్ ను కొంచెం కూడా అందుకునే ప్రయత్నం చేయలేదు. మొదటి రోజు ఓపెనింగ్స్ నుండే కంప్లీట్ గా ట్రాక్ తప్పిందనే చెప్పాలి. 3 కోట్లు కూడా రికవరీ కాలేదంటున్నారు. ఇంకా రూ.23 కోట్లు రికవరీ అవ్వాల్సి ఉంది. దీంతో ఈ ప్రభావం డిస్ట్రిబ్యూటర్స్‌పై బాగానే పడుతుందని అంటున్నారు. జనం ఇంకా ఆర్ఆర్ఆర్ హ్యాంగోవర్ లోనే ఉన్నారు. కేజీఎఫ్, బీస్ట్ వచ్చాక గనికి ఆ కాస్త థియోటర్స్ కూడా ఉండకపోవచ్చు. ఎవరికీ ఈ సినిమాపై ఆసక్తి లేదు. పాపం వరుణ్ తేజ్ కెరీర్‌లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ అని చెప్పాలి.
సాధారణంగా ఏ సినిమా అయినా రిలీజ్ అయిన 4-5 వారాల తర్వాత డిజిటల్‌లోకి వస్తుంది. కానీ కొన్ని సినిమాలు మాత్రం రెండు నుంచి మూడు వారాల్లోపే ఓటీటీల్లో దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు గని సినిమా కూడా రిలీజ్ అయిన మూడు వారాలకు అంటే ఏప్రిల్ 29నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా ఈ సినిమాలో కన్నడ హీరో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, జగపతి బాబు, నదియాలు కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…