iPhone : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ఐఫోన్లను చాలా చవక ధరలకే కొనుగోలు చేసే వీలు కల్పించనుంది. ఈ నెల 23వ తేదీ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం కానున్న విషయం విదితమే. అందులో ఐఫోన్ ఎస్‌ఈకి చెందిన 2వ, 3వ జనరేషన్ ఫోన్లను వినియోగదారులు చాలా తక్కువ ధరలకే కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ ఆఫర్‌కు చెందిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఫ్లిప్ కార్ట్ ఈ ఆఫర్లను అందించనుంది. ఈ సేల్‌లో బాగంగా రూ.39,900 విలువైన ఐఫోన్ ఎస్‌ఈ 2వ జనరేషన్‌ను రూ.11,499 ధరకే కొనవచ్చు. ఎలాగంటే.. ఈ ఫోన్‌పై సేల్‌లో రూ.9,401 ఫ్లాట్ డిస్కౌంట్‌ను ఇవ్వనున్నారు. దీంతో ఫోన్ ధర రూ.30,499కి తగ్గుతుంది. ఇక ఏదైనా ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే దీనిపై రూ.19వేలు తగ్గుతుంది. దీంతో ఫోన్ ధర రూ.11,499 అవుతుంది. ఇలా ఈ ఫోన్‌ను చాలా చవక ధరకే కొనవచ్చు. ఇక ఐఫోన్ ఎస్‌ఈ 3వ జనరేషన్ ఫోన్ ధర కూడా ఇదే పద్ధతిలో తగ్గనుంది. దీంతో ఈ ఫోన్‌ను ఫ్లిప్ కార్ట్ సేల్‌లో రూ.24,900 కు కొనవచ్చు.
ఇక ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్ 13 ఫోన్లపై కూడా భారీ తగ్గింపు ధరలను అందివ్వనున్నారు. ఇటీవలే యాపిల్ ఐఫోన్ 14 ఫోన్లను రిలీజ్ చేసిన విషయం విదితమే. అయితే ఈ విధంగా చేయడంతోపాటు ఐఫోన్ 13 ఫోన్ల ధరలను తగ్గించారు. దీంతో ఈ ఫోన్లపై ఫ్లిప్ కార్ట్ సేల్‌లో మరింత ధర తగ్గించనున్నారు. ఈ క్రమంలోనే ఐఫోన్ 13ను ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఏకంగా రూ.50వేలకే కొనుగోలు చేయవచ్చు. దీనిపై మొత్తం రూ.20వేలకు డిస్కౌంట్‌ను అందించనున్నారు. కాగా ఫ్లిప్‌కార్ట్‌లో నిర్వహించనున్న బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఇంకా అనేక వస్తువులపై తగ్గింపు ధరలను అందించనున్నారు. ఈ సేల్ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…