కోవిడ్ నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితి దారుణంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. భారత్‌లో మొదటగా గుర్తించబడిన డెల్టా వేరియెంట్ ప్రపంచంలో ఇప్పుడు అనేక దేశాల్లో వ్యాప్తి చెందుతుందని, అది అనేక సార్లు మ్యుటేషన్‌కు గురవుతుందని ఆ సంస్థ తెలిపింది. ఈ మేరకు WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
ప్రపంచంలో చాలా దేశాల్లో కోవిడ్ మళ్లీ వ్యాప్తి చెందుతుందని, అందువల్ల టీకాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. డెల్టా వేరియెంట్ అనేక దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రమాదకరంగా మారిందన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా 98 దేశాల్లో డెల్టా వేరియెంట్‌ను గుర్తించారని అన్నారు. ఈ వేరియెంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు. అందువల్ల టీకాల పంపిణీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. అలాగే కోవిడ్ జాగ్రత్తలను పాటించాలన్నారు. కరోనా కేసులు వేగంగా పెరిగే చోట్ల టెస్టులను ఎక్కువగా చేయాలన్నారు. కోవిడ్ మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.