సాధారణంగా పెళ్ళి అయిన తరువాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడి వారి ప్రేమకు గుర్తుగా పిల్లలు జన్మించడం సర్వసాధారణమే. అయితే అమెరికాకు చెందిన ఓ మహిళ మాత్రం తన భర్త కోరిక మేరకు, తన భర్త చనిపోయిన 14 నెలలకే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. అంతేకాదండోయ్ వచ్చే ఏడాది మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలిపారు. అసలు ఇది ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా..
అమెరికాలోని ఓక్లహామాకు చెందిన సారా షెలెన్‌బెర్గర్ అనే మహిళకు 2018 సెప్టెంబర్‌లో స్కాట్ తో వివాహం జరిగింది. అయితే వివాహం జరిగిన ఏడాదిన్నరకే గుండెపోటుతో మరణించారు. స్కాట్ మరణించక ముందే ఒకసారి తనకు గుండెపోటు రావడంతో అంతకు మునుపే వారు భద్రపరిచిన పిండాల ద్వారా పిల్లల్ని కనాలని భావించారు. ఈ క్రమంలో మరోసారి గుండెపోటు వచ్చి మరణించడంతో తన భర్త కోరికను సారా నెరవేర్చాలని కోరుకుంది.
ఈ క్రమంలోనే తనకు వేరే దారి లేక ముందుగా భద్ర పరిచిన పిండాల ద్వారా బార్బడోస్ ఫెర్టిలిటీ క్లినిక్ సహకారంతో తన భర్త కోరిక నెరవేరింది. ఈ క్రమంలోనే మరొక పిండాన్ని భద్రపరిచి వచ్చే ఏడాదికి ఆ బిడ్డను కనాలని సారా భావించింది. ఈ క్రమంలోనే మే మూడో తేదీన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి తన బిడ్డను గుండెకు హత్తుకున్న సారా తన బిడ్డకు తన తండ్రిలోని లేని లోటును తెలియకుండా పెంచుతాననే ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ విధంగా తనకు పుట్టిన మగ బిడ్డకు ఎంతో ప్రేమగా “గుడ్ మెడిసన్” అనే పేరుతో పిలుస్తున్నారు.