దేశవ్యాప్తంగా కరోనా కేసులు అధికమవడంతో దీని ప్రభావం దేశీయ మార్కెట్ పై అధికంగా పడుతుంది. గత ఏడాది కరోనా కేసులు అధికమవడంతో లాక్ డౌన్ విధించడం వల్ల ఈ ప్రభావం దేశీ ఆర్థిక వ్యవస్థ పై కోలుకోలేని దెబ్బ కొట్టింది. తాజాగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతమవుతున్న సమయంలో దీని ప్రభావం అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరల పై పడింది.
ప్రపంచంలో ముడి చమురు దిగుమతులలో భారత్ మూడవ స్థానంలో ఉంది. అయితే ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్న కారణంగా ముడి చమురు ధరలు పూర్తిగా పతనమయ్యాయి. ఈ క్రమంలోనే మంగళవారం బ్రెంట్ క్రూడాయిల్ ధర 48 సెంట్లు పడిపోగా.. బుధవారం మరో 48 సెంట్లు పతనమయ్యింది.
ఎక్కువ చమురు వినియోగించే దేశాలలో ఇండియా ఒకటి. ఇక్కడ రోజు రోజుకి కేసులు పెరగడంతో ఆయిల్ వినియోగం తగ్గిందని కోటక్ సెక్యూరిటీస్ కమాడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రవీంద్ర రావ్ అన్నారు.ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 66.09 డాలర్లుగా ఉందని ఆయన పేర్కొన్నారు.