Big Mouth: సాధారణంగా కొంతమంది నోటిని చూడగానే తమ నోటికి తాళం వేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే ఎంతో పెద్ద నోటితో చాలా మంది గోల చేస్తూ అందరినీ భయపడుతుంటారు. అలాంటి వారి జోలికి ఎవరు పోరు. ఈ క్రమంలోనే టిక్ టాక్ ద్వారా ఎంతో పేరు సంపాదించుకున్న 31 సంవత్సరాల సమంతా రామ్‌స్‌డెల్ నోటిని చూసి ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డు కూడా తన పేరును అందులో పొందుపరిచింది.
సాధారణంగా గిన్నిస్ బుక్ రికార్డ్ సొంతం చేసుకోవాలంటే వారిలో ఉన్న ప్రతిభ నైపుణ్యం ఆధారంగా గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకుంటారు. కానీ సమంతా రామ్‌స్‌డెల్ మాత్రం తనకున్న పెద్ద నోటి ద్వారా గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకుంది.ఆమె నోరు 6.52 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె నోరు తెరవడంతో ఆమె చుట్టూ కొలతలు తీసి పరిశీలనలు చేసిన అనంతరం ప్రపంచంలోనే అత్యంత పెద్ద నోరు కలిగిన యువతిగా గిన్నిస్ బుక్ రికార్డులో తన పేరును నమోదు చేశారు.
అయితే ఈమెకు చిన్నప్పటి నుంచి తను ఎంతో పెద్దగా ఉండేదని ఈ క్రమంలోనే తన చిన్ననాటి ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇప్పటి వరకు ఈమె కుటుంబంలో ఎవరికీ ఇంత పెద్ద నోరు లేదు ఈమేకు మాత్రం ఏకంగా ఒక యాపిల్ పండు మొత్తం పట్టే అంత నోరు ఉండటం చేత ఈమె గిన్నిస్ బుక్ రికార్డును సొంతం చేసుకుంది.