ఆప్గనిస్థాన్‌లో ప్రస్తుతం హృదయ విదారకమైన పరిస్థితులు నెలకొన్న విషయం విదితమే. తాలిబన్ల చేతుల్లో బలి అవకుండా ఉండేందుకు గాను ఆఫ్గనిస్థాన్ పౌరులు దేశం దాటుతున్నారు. ఈ క్రమంలోనే విమానాల్లో తీవ్రమైన రద్దీ నెలకొంది. కాగా ఆప్గన్ పౌరులను ఖతార్ పంపేందుకు వచ్చిన ఓ అమెరికన్ విమానంలో ఏకంగా 640 మంది ప్రయాణించారు. విమానంలో కిందే కూర్చుని ఆఫ్గనిస్థాన్ నుంచి బయల్దేరి వెళ్లిపోయారు.
కాబూల్ నుంచి ఖతార్‌కు అమెరికాకు చెందిన బోయింగ్ సి-17 విమానం బయల్దేరింది. అందులో సాధారణంగా అయితే 134 మంది మాత్రమే ప్రయాణించేందుకు వీలుంటుంది. కానీ ఆ విమానంలో ఏకంగా 640 మంది వెళ్లారు. ఈ క్రమంలో వారు విమానంలో కింద కూర్చుని ఇసుక వేస్తే రాలనట్లు ఉండి ప్రయాణం చేశారు. చివరకు ఖతార్ చేరుకున్నారు.
A photo from the inside of Reach 871, a U.S. Air Force C-17 flown from Kabul to Qatar yesterday with 640 Afghans on board, via @DefenseOne https://t.co/NMqqOSqDdv pic.twitter.com/J2yTl84han
— Vera Bergengruen (@VeraMBergen) August 16, 2021
ఆఫ్గనిస్థాన్‌లో రోజు రోజుకీ పరిస్థితులు దిగజారిపోతుండడంతో పౌరులు విమానాల్లో ఆ దేశం విడిచి వెళ్లిపోతున్నారు. పలు దేశాలకు చెందిన విమానాల్లో వారు ప్రయాణం చేస్తున్నారు.