దేశవ్యాప్తంగా మూడో దశ కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమం చురుగ్గా కొనసాగుతోంది. 45 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి టీకాలను ఇస్తున్నారు. అయితే పలు రాష్ట్రాలు టీకాల నిల్వలు తగ్గుతున్నాయని, వెంటనే డోసులను పంపాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. ఈ క్రమంలో స్పందించిన కేంద్రం టీకాలను అయిపోయిన వెంటనే రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నామని స్పష్టం చేసింది. అయితే కోవిడ్ వ్యాక్సిన్లను తీసుకున్నప్పటికీ కొందరికి కరోనా సోకుతోంది. ఇలా ఎందుకు జరుగుతుందో నిపుణులు తెలియజేస్తున్నారు.
కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నా కొందరికి కోవిడ్ సోకడంపై వైద్య నిపుణులు పలు కారణాలను చెబుతున్నారు. వ్యాక్సిన్ సరిగ్గా వేయకపోయినా, నిర్ణీత డోసు వేయకపోయినా, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నా కోవిడ్ సోకుతుంది. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఈ సందర్భాల్లో కోవిడ్ సోకేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఇక ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏ కోవిడ్ వ్యాక్సిన్ కూడా 100 శాతం కోవిడ్ నుంచి రక్షణను అందించవు. అందువల్ల కూడా కోవిడ్ టీకాలను తీసుకున్న తరువాత కొందరు కోవిడ్ బారిన పడేందుకు అవకాశం ఉంటుంది. ఇక వ్యాక్సిన్ తీసుకునేందు కన్నా ముందుగానే ఎవరికైనా కోవిడ్ ఉంటే వ్యాక్సిన్ తీసుకుని కూడా ప్రయోజనం ఉండదు. అలాంటి వారు కోవిడ్ తగ్గాక వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో కూడా కోవిడ్ టీకాలను తీసుకున్న తరువాత కోవిడ్ సోకుతోంది. అయితే టీకా తీసుకున్న తరువాత కూడా కరోనా జాగ్రత్తలను పాటించడం వల్ల కోవిడ్ సోకకుండా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…