దేశవ్యాప్తంగా రోజు రోజుకీ కోవిడ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. శనివారం కొత్తగా 1,45,384 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒక్క రోజులో అత్యధికంగా నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య కూడా ఇదే కావడం విశేషం. ఇక దేశ వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 1,32,05,926 కు చేరుకుంది. కాగా కరోనా ప్రభావం దేశంలో మొదలైనప్పటి నుంచి రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య 1 లక్ష మార్కును దాటడం ఇది 5వ సారి. ఏప్రిల్ 5వ తేదీన 1,03,558 కోవిడ్ కేసులు నమోదు కాగా, 7న 1,15,736 కేసులు నమోదయ్యాయి. అలాగే ఏప్రిల్ 8వ తేదీన 1,26,789 కేసులు, 9వ తేదీన 1,31,968 కేసులు నమోదయ్యాయి.
శనివారంతో దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. ఆ సంఖ్య 10,46,631కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 794 మంది చనిపోయారు.
గత సెప్టెంబర్ నెల తరువాత దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 10 లక్షలు దాటడం మళ్లీ ఇదే తొలిసారి. సెప్టెంబర్ 20, 2020వ తేదీన 10 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా గడిచిన 24 గంటల్లో 77,567 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…