నటుడు, సంఘ సేవకుడు సోనూ సూద్‌కు చెందిన ఇళ్లలో, కార్యాలయాల్లో గత 3 రోజులుగా ఇన్‌కమ్‌ట్యాక్స్ విభాగం అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ముంబైతోపాటు లక్నోలో ఉన్న ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే శనివారం ఆదాయపు పన్ను విభాగం అధికారులు సంచలన ప్రకటన చేశారు. నటుడు సోనూసూద్ రూ.20 కోట్ల మేర పన్ను ఎగ్గొట్టారని తెలిపారు. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
కరోనా నేపథ్యంలో సోనూసూద్ ఎంతో మందిని ఆదుకున్నారు. ఒక సంఘ సేవకుడిగా ఆయనకు మర్యాద ఇస్తాం. కానీ ఆయన పన్ను ఎగ్గొట్టారు. అందువల్ల చట్టం తన పని తాను చేసుకోక తప్పదు.. అని అధికారులు తెలిపారు.
కాగా గతేడాది జూలైలో కోవిడ్ బాధితులకు సహాయం అందించేందుకు గాను సోనూ సూద్.. తన పేరిట చారిటీ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. దానికి రూ.18 కోట్ల మేర విరాళాలు రాగా అందులో రూ.1.9 కోట్లను సహాయం కోసం ఖర్చు పెట్టారు. మిగిలిన మొత్తం బ్యాంకు అకౌంట్లలో అలాగే ఉందని అధికారులు తెలిపారు. విదేశాల నుంచి విరాళాలు తీసుకునే విషయంలోనూ సోనూసూద్ ఫౌండేషన్ నిబంధనలను ఉల్లంఘించిందని ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం అధికారులు తెలిపారు.
ఇక లక్నోలో ఉన్న ఓ కంపెనీ ద్వారా సోనూ సూద్ రూ.20 కోట్ల మేర లోన్లు తీసుకున్నట్లు బోగస్ పత్రాలను సృష్టించారని, ఆ లోన్లు బోగస్ అని, లోన్లు తీసుకున్నట్లు 20 ఎంట్రీలు ఉన్నాయని, కానీ అవన్నీ ఫేక్ అని అధికారులు తెలిపారు. అందువల్ల సోనూసూద్ రూ.20 కోట్ల మేర పన్నులను ఎగ్గొట్టినట్లు గుర్తించామని అధికారులు తెలియజేశారు.
అయితే సోనూసూద్ ఇళ్లు, ఆఫీసులపై ఐటీ శాఖ దాడులు చేయడంపై శివసేన, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు బీజేపీని విమర్శిస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వానికి సోనూ సూద్ బ్రాండ్ అంబాసిడర్ అయినందునే ఆయన ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు చేస్తుందని వారు ఆరోపించారు. కానీ బీజేపీ నేతలు ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు. సోనూసూద్ బ్రాండ్ అంబాసిడర్ కావడానికి, ఆయన ఇళ్లపై ఐటీ దాడులు జరగడానికి సంబంధం లేదని అంటున్నారు. కాగా ఈ విషయం సంచలనం సృష్టిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…