బీహార్‌లో ఏం జరుగుతుందో తెలియడం లేదు కానీ ఇటీవలి కాలంలో కొందరి ఖాతాల్లో కోట్ల రూపాయల్లో డబ్బు జమ అవుతోంది. బ్యాంకులో ఏర్పడిన సాంకేతిక సమస్య లేదా ఇతర కారణాలు ఏమున్నాయో తెలియదు. కానీ కొందరి ఖాతాల్లో ఈ మధ్య కాలంలో కోట్ల రూపాయలు జమ అయ్యాయి. అలాగే తాజాగా ఓ రైతు ఖాతాలో ఏకంగా రూ.52 కోట్లు జమ అయ్యాయి. దీంతో అతను, అధికారులు షాక్ తిన్నారు.
బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా కతిహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ గ్రామానికి చెందిన రామ్ బహదూర్ షా అనే రైతుకు నెల నెలా పెన్షన్ వస్తోంది. అందులో భాగంగానే పెన్షన్ వచ్చిందా, రాలేదా ? అన్న విషయాన్ని తెలుసుకునేందుకు అతను సమీపంలో ఉన్న కస్టమర్ సర్వీస్ పాయింట్ (సీఎస్‌పీ) వద్దకు వెళ్లాడు.
సీఎస్‌పీ వద్ద ఉద్యోగులు అతని ఖాతాను చెక్ చేశారు. అందుకుగాను ఆధార్ బయోమెట్రిక్ తీసుకున్నారు. అయితే రామ్ బహదూర్ షా ఖాతాలో ఏకంగా రూ.52 కోట్లు ఉండడాన్ని చూసి అందరూ ఖంగు తిన్నారు. అంత మొత్తం ఆ రైతు ఖాతాలోకి ఎలా వచ్చిందో తెలియడం లేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అయితే ఆ రైతు మాత్రం తన జీవితం దుర్భరంగా మారిందని, కనుక ఆ మొత్తంలో కొంత డబ్బును తన ఖాతాలో అలాగే ఉంచాలని.. దీంతో తన జీవితం బాగు పడుతుందని అధికారులను వేడుకుంటున్నాడు. అయినా వారు అతని మాట వినరు కదా. అయితే ఈ విధంగా చాలా మంది ఖాతాల్లో కోట్ల రూపాయల డబ్బు ఎందుకు జమ అవుతుందో అర్థం కావడం లేదు. దీనిపై త్వరలోనే వివరాలు తెలియనున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…