దేశంలో కరోనా కేసులు రోజురోజుకు లక్షల సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ విధంగా కరోనా కేసులు పెరగడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలియజేశారు. ఈ ఏడాది జనవరి ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది.
వ్యాక్సినేషన్ ప్రారంభం కాగానే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజలందరూ కరోనా మార్గదర్శకాలను పాటించడం పూర్తిగా మానేశారు. ఈ క్రమంలోనే వైరస్ పరివర్తనం చెందటంతో కరోనా కేసుల సంఖ్య అధికమయ్యాయని ఈ సందర్భంగా డాక్టర్ గులేరియా తెలిపారు.
కరోనా కేసులు పెరుగుతుండగా.. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి గురవుతుందని, కరోనా కట్టడి చేయటానికి ఆస్పత్రుల్లో మౌలిక వసతులను , పడగలను మెరుగు పరచాలని ఆయన సూచించారు. ఈ క్రమంలోనే దేశంలో మతపరమైన కార్యక్రమాలు, ఎన్నికల జరుగుతుండటం కూడా కేసులు పెరగడానికి ప్రధాన భయమా కారణమని ఆయన వెల్లడించారు. అదేవిధంగా ప్రజలందరూ కరోనా టీకా వేయించుకొని, జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని ఆయన సూచించారు.