నటుడు, సంఘ సేవకుడు సోనూసూద్‌కు ఐటీ విభాగం షాకిచ్చింది. సోనూసూద్‌కు చెందిన ఇళ్లు, ఆఫీసుల్లో బుధవారం ఐటీ విభాగం అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ముంబైలో ఉన్న ఆయన ఇళ్లతోపాటు లక్నోలోని కంపెనీ కార్యాలయాల్లో ఏక కాలంలో తనిఖీలు చేశారు.
కాగా నటుడు సోనూసూద్‌ను ఇటీవలే ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం తమ ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. అక్కడి ప్రభుత్వ స్కూళ్లలో విద్యను ప్రోత్సహించేందుకు గాను సోనూ సూద్‌ను సీఎం కేజ్రీవాల్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. అయితే సోనూసూద్.. కేజ్రీవాల్‌తో సమావేశం అయిన అనంతరం పాలిటిక్స్ లో చేరుతున్నారా ? అని సోనూను మీడియా ప్రశ్నించింది. కానీ ఆయన ఆ వార్తలను కొట్టి పారేశారు. ఓ సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు మాత్రమే ఆ విధంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో చర్చించానని తెలిపారు.
అయితే ఆ మీటింగ్ అనంతరం సోనూసూద్‌కు చెందిన ఇళ్లు, ఆఫీసుల్లో ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి సోనూ సూద్ పనిచేస్తారన్న వార్తల నేపథ్యంలోనే బీజేపీ ప్రభుత్వం ఆయన ఇళ్లు, ఆఫీసులపై ఐటీ దాడులను చేయిస్తుందని పలువురు విమర్శిస్తున్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం ఈ విషయాన్ని ఖండించారు.
ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం ప్రత్యేకమైనదని, ఒక వ్యక్తి సామాజిక సేవా కార్యక్రమాలు చేసినా ఐటీ చట్టం ప్రకారం పన్ను కట్టకపోతే ఇబ్బందులు తప్పవని, అందువల్ల దానికి, ఐటీకి ముడి పెట్టవద్దని బీజేపీ నేతలు కోరుతున్నారు. ఏది ఏమైనా సోనూ సూద్ ఇళ్లు, ఆఫీసులపై ఐటీ దాడులు నిర్వహించడం హాట్ టాపిక్‌గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…