తన పొలంలో ఉన్నటువంటి బావిని ఎవరో దొంగిలించారని,ఎలాగైనా తన బావిని వెతికి పట్టుకొని తనకు అప్పజెప్పాలని ఓ రైతు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని ఫిర్యాదుకు పోలీసులు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. బాబుని దొంగలించడం ఏంటి దానిని వెతికి పట్టుకోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. అయితే వివరాలలోకి వెళ్లాల్సిందే.
కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని భేండవాడ గ్రామ పంచాయతీ పరిధి మావినహొండ గ్రామంలో మల్లప్ప అనే రైతు తన కుమారులతో కలిసి రాయబాగ్ పోలీస్ స్టేషన్లో మంగళవారం తనపొలంలో ఉన్న బావిని ఎవరో దొంగిలించారని ఎలాగైనా దానిని వెతికి పట్టుకోవాలని ఫిర్యాదు చేశాడు. ఈ విషయం గురించి పోలీసులు ఆరా తీయగా.. గ్రామ పంచాయతీ అధికారులు తన పొలంలో బావిని తవ్వినట్లు రికార్డులు సృష్టించి ప్రభుత్వ నిధులను కాజేశారు. అయితే ప్రస్తుతం భావి తవ్వకానికి తీసుకున్న రుణం వాయిదాల పద్ధతిలో చెల్లించాలంటూ రైతుకి ప్రభుత్వం నుంచి నోటీసులు వస్తున్నాయి.
అయితే ఈ విధంగా నోటీసులు రావడంతో ఎంతో ఆశ్చర్యపోయిన రైతు అసలు విషయం తెలుసుకొని ముల్లును ముల్లుతోనే తీయాలనే ఉద్దేశ్యంతో ఈ విధంగా బావి పోయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాడు. ఈ విధంగా అధికారులు తన పొలంలో బావి తవ్వినట్లు రికార్డులు సృష్టించి అవినీతికి పాల్పడిన విషయం బయట పెట్టాలనే ఉద్దేశంతో రైతు ఈ విధంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…