ముఖ్య‌మైన‌వి

కేవ‌లం రూ.2 ల‌క్ష‌ల‌తోనే విలాస‌వంత‌మైన ఇంటిని క‌ట్టుకోవ‌చ్చు..! ఎలాగో ఈయ‌న చెబుతున్నారు !

జీవితంలో సొంత ఇంటిని నిర్మించుకోవాల‌ని ఎవ‌రికైనా క‌ల ఉంటుంది. అందుకు అనుగుణంగానే ఎవ‌రి ఇష్టానికి త‌గిన‌ట్లు వారు ఇళ్ల‌ను క‌ట్టుకుంటుంటారు. అయితే ప్ర‌స్తుతం అన్ని ర‌కాల మెటీరియ‌ల్ ధ‌ర‌లు పెరిగిపోయాయి. దీంతో ఇల్లు క‌ట్ట‌డం అధిక ఖ‌ర్చుతో కూడిన ప‌నిగా మారింది. క‌నీసం రూ.10 ల‌క్ష‌లు చేతిలో లేనిదే ఇల్లు క‌ట్టుకోలేం. అయితే మీకు 100 గ‌జాల స్థ‌లం ఉంటే చాలు.. అందులో కేవ‌లం రూ.2 ల‌క్ష‌ల‌కే చ‌క్క‌ని ఇంటిని ఎలా క‌ట్టుకోవాలో ఆయ‌న చెబుతున్నారు.

మ‌ల్కాజిగిరికి చెందిన విజ‌య‌వ‌ర్ధ‌న్ యాద‌వ్ కేవ‌లం 100 గ‌జాల స్థలంలోనే రూ.2 ల‌క్ష‌ల‌తోనే ఇల్లు ఎలా క‌ట్టుకోవాలో చెబుతున్నారు. ఇల్లు క‌ట్టాలంటే సిమెంట్‌, ఇసుక‌, ఇటుక‌, కూలీల ఖ‌ర్చు చాలా అవుతుంది. అయితే విజ‌య‌వ‌ర్ధ‌న్ కొత్త‌గా అందుబాటులోకి తెచ్చిన ఇంట‌ర్ లాకింగ్ బ్రిక్స్‌తో త‌క్కువ ఖ‌ర్చుతోనే ఇల్లు క‌ట్టుకోవ‌చ్చు. ట‌ఫీ పేరిట ఓ కంపెనీని ఏర్పాటు చేసిన ఆయ‌న స‌ద‌రు బ్రిక్స్‌ను త‌యారు చేసి అమ్ముతున్నారు.

ఇంట‌ర్ లాకింగ్ బ్రిక్స్ మ‌న‌కు కొత్తే. కానీ విదేశాల్లో వాటితో ఇప్ప‌టికే చాలా మంది ఇళ్ల‌ను నిర్మించుకున్నారు. దీంతో త‌క్కువ స‌మ‌యంలోనే ఇంటిని నిర్మించుకోవ‌చ్చు. కూలీల అవ‌స‌రం, ఖ‌ర్చులు చాలా త‌గ్గుతాయి. మ‌రి అలాంటి ఇటుక‌ల‌తో ఇంటిని క‌డితే దృఢంగా ఉంటుందా ? అని సందేహం రావ‌చ్చు, కానీ అలా భ‌యం చెందాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే స‌ద‌రు బ్రిక్స్ ను కంక‌ర‌, సిమెంట్‌, ఇసుక‌, యాష్ వంటి వాటిని మిక్స్ చేసి త‌యారు చేస్తారు. క‌నుక ఇల్లు దృఢంగానే ఉంటుంది.

ఇక ప్ర‌స్తుతం హైద‌రాబాద్ న‌గరంలోని మ‌ల్కాజిగిరితోపాటు కొంప‌ల్లి, సైనిక్‌పురి వంటి ఏరియాల్లో ఇంట‌ర్ లాకింగ్ బ్రిక్స్ తో నిర్మాణాల‌ను చేప‌డుతున్నారు. వీటి వాడ‌కం ప‌ట్ల ఎక్కువ‌గా ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మ‌రిన్ని ఇటుక‌ల త‌యారీ ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏర్పాటు చేయాల‌ని విజ‌య‌వ‌ర్ధ‌న్ యోచిస్తున్నారు. దీంతో త్వ‌ర‌లో మ‌రింత మందికి ఈ ఇటుక‌లు అందుబాటులోకి రానున్నాయి.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM